CSK vs RR: సంజూ శాంసన్ ‘సిక్సర్ల’ సునామీ... బద్ధలైన రికార్డులివే...

First Published | Sep 22, 2020, 8:47 PM IST

కేరళ యంగ్ సెన్సేషన్ సంజూ శాంసన్... ఐపీఎల్ 2020లో ఆడిన మొదటి మ్యాచులోనే అదరగొట్టాడు. టాప్ క్లాస్ స్పిన్నర్లు, పేసర్లను ఎదుర్కొంటూ సిక్సర్ల మోత మోగించాడు. 9 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 32 బంతుల్లోనే 74 పరుగులు చేశాడు. ఈ దశలో పలు రికార్డులను బద్ధలు కొట్టాడు సంజూ శాంసన్.

రాజస్థాన్ రాయల్స్ తరుపున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు సంజూ శాంసన్.
జోస్ బట్లర్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా, సంజూ 19 బంతుల్లో అర్ధశతకం బాదాడు.

పియూష్ చావ్లా బౌలింగ్‌లో ఆరు సిక్సర్లు బాదాడు సంజూ శాంసన్. ఒకే ఓవర్‌లో 4 సిక్సర్లతో 28 పరుగులు రాబట్టాడు.
సంజూ శాంసన్ నేటి ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు కొట్టాడు. ఇలా శాంసన్ ఒకే మ్యాచ్‌లో9 సిక్సర్లు బాదడం రెండోసారి. ఒక్క క్రిస్‌గేల్ మాత్రమే సంజూ శాంసన్ కంటే ముందున్నాడు. గేల్ ఆరు సార్లు ఈ ఫీట్ సాధించాడు.
సంజూ శాంసన్ సిక్సర్ల సునామీ కారణంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్నర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు చావ్లా.
చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా టాప్‌లో నిలిచాడు సంజూ శాంసన్.
2019లో కెఎల్ రాహుల్ 19 బంతుల్లో చెన్నైపై అర్ధశతకం బాదగా, సంజూ శాంసన్ కూడా 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.
2020 సీజన్ 13లో ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన క్రికెటర్‌గా నిలిచాడు సంజూ శాంసన్.
ఏబీ డివిల్లియర్స్ 29 బంతుల్లో, స్టోయినిస్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేసుకోగా సంజూ 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు.

Latest Videos

click me!