MS Dhoni: డ్రోన్ల బిజినెస్ లోకి హెలికాప్టర్ షాట్ల సృష్టికర్త.. లాభసాటి వ్యాపారమే..

First Published Jun 6, 2022, 6:06 PM IST

టీమిండియా అభిమానులకు హెలికాప్టర్  షాట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. గత దశాబ్ద కాలంగా ఆ షాట్ రూపకర్త సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు అదే వ్యక్తి డ్రోన్ల వ్యాపారంలోకి దిగుతున్నాడు. 

భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోని కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. గత కొద్దికాలంగా దేశంలో భారీగా పెట్టుబడులు ఆశిస్తున్న డ్రోన్స్ బిజినెస్ లోకి ధోని కాలుమోపాడు. 

ప్రముఖ డ్రోన్ల తయారీ సంస్థ గరుడ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ల పెట్టుబడులు పెట్టాడు. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 26 నగరాల్లో 300 డ్రోన్లు, 500 మంది పైలెట్లు పనిచేస్తున్నారు.

Latest Videos


దేశంలో డ్రోన్ల పెరుగుదల ఆవశ్యకతను తెలియజేస్తూ ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాలు ఇటీవలే ఈ సంస్థ చేస్తున్న కృషి ని కొనియాడారు.

తాజాగా ధోని.. ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టాడు. ఇదే విషయమై ధోని స్పందిస్తూ.. ‘గరుడా ఏరోస్పేస్ లో పెట్టుబడులు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లు అందించే ప్రత్యేకమైన డ్రోన్లతో వారి వృద్ధిని చూడటానికి  ఎదురుచూస్తున్నాను..’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. 

ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన ధోని..  బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవమరిస్తుండటం గమనార్హం. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన తర్వత ధోని  వ్యవసాయాధారిత, వస్త్ర, లిక్కర్, మోటార్ కార్ రంగాలలో విరివిగా పెట్టుబడులు పెడుతున్నాడు. 

ధోని పెట్టుబడులు పెట్టిన సంస్థలలో కొన్ని.. ఖాతాబుక్, 7ఇంక్ బ్రూస్, కార్స్ 24, హోమ్ లోన్, స్పోర్ట్స్ ఫిట్, హోటల్ మహి రెసిడెన్సీ వంటి సంస్థలలో కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ కు పెట్టుబడులున్నాయి. 
 

click me!