సీఎస్‌కేకి అంత సీన్ లేదు! సంజూ కోసమే ఆ టీమ్‌కి సపోర్ట్, ఈసారైనా ఆర్‌సీబీ గెలిస్తే... - శ్రీశాంత్

First Published Mar 19, 2023, 8:58 PM IST

క్రికెటర్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు స్పాట్ ఫిక్సింగ్ స్కామ్‌లో ఇరుక్కుని క్రికెట్‌కి దూరమయ్యాడు శ్రీశాంత్. ఏడేళ్ల బ్యాన్ తర్వాత తిరిగి ఆడాలని ఎంతగానో ప్రయత్నించినా కుదర్లేదు. నిరాశగా రిటైర్మెంట్ తీసుకున్న శ్రీశాంత్, ఐపీఎల్ 2023 సీజన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

S Sreesanth

‘నాకు తెలిసి ఈసారి చెన్నై సూపర్ కింగ్స్, ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని అనుకోవడం లేదు. నేను మలయాళీని. మల్లు కెప్టెన్ ఉండడం వల్లే రాజస్థాన్ రాయల్స్‌ని నేను సపోర్ట్ చేస్తున్నా... అయితే వాళ్లు కూడా ఐపీఎల్ మొదటి సీజన్‌లోనే గెలిచారు..

Image credit: Getty

కొత్త టీమ్ గెలిస్తే బాగుంటుంది. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆర్‌సీబీ టైటిల్ గెలిస్తే చాలా గొప్పగా ఉంటుంది. భారత క్రికెట్‌కి విరాట్ కోహ్లీ ఎంతో చేశాడు. అతను ఉన్న టీమ్, ఐపీఎల్ గెలిస్తే న్యాయంగా ఉంటుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్...

Latest Videos


Legends Leauge Sreesanth

ఏడేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ 2021 మినీ వేలం, 2022 మెగా వేలానికి రిజిస్టర్ చేయించుకున్న శ్రీశాంత్, షార్ట్ లిస్టులో పేరు దక్కించుకోలేకపోయాడు... సయ్యద్ ముస్తాక్ ఆలీ, విజయ్ హాజారే ట్రోఫీ వంటి దేశవాళీ టోర్నీల్లో సంజూ శాంసన్ కెప్టెన్సీలో ఆడాడు.. 

39 ఏళ్ల వయసులోనూ టీమిండియాలోకి తిరిగి రీఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన శ్రీశాంత్, 2022 మార్చిలో రిటైర్మెంట్ ప్రకటించాడు...

ఐపీఎల్ చరిత్రలో మూడు సార్లు ఫైనల్ చేరినా రాయల్ ఛాలెంజర్స్, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. 2016లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది...

Image credit: PTI

9 సీజన్ల పాటు ఆర్‌సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించినా టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ, 2021 సీజన్ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకుంది. 2021 సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, 2022 సీజన్‌లో ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో రెండో క్వాలిఫైయర్‌లో ఓడి మూడో స్థానంలో నిలిచింది.. 

click me!