టీమిండియా బౌలింగ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వీకే!... పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్

Published : Jul 04, 2023, 03:29 PM IST

ద్వైపాక్షిక సిరీసుల్లో ఇండియాపై పాకిస్తాన్‌కి మంచి రికార్డు ఉంది. వసీం అక్రమ్, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్, షోయబ్ అక్తర్ వంటి భయంకర పాకిస్తాన్ బౌలర్లు, ప్రపంచ దేశాల బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు... టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌కి అలాంటి ఘనమైన చరిత్ర లేదు.  

PREV
17
టీమిండియా బౌలింగ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వీకే!... పాక్ మాజీ స్పిన్నర్ సయిద్ అజ్మల్

మాంసం, పుష్టికరమైన భోజనం తిని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్లు దిట్టంగా ఉంటే, భారత బౌలర్లు బక్క పలచగా గట్టిగా గాలి వీస్తే ఎగిరిపోయేలా ఉండేవారు.. ఇప్పుడు పరిస్థితి బాగా మారినా, బ్యాటింగ్‌పైన పెట్టిన శ్రద్ధ, ఫాస్ట్ బౌలింగ్ యూనిట్‌పై పెట్టడం లేదు టీమిండియా...
 

27
Image credit: PTI

‘భారత ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వీకే... ఇప్పుడున్న వారిలో మహ్మద్ సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. షమీ కూడా బాగానే వేస్తున్నాడు. స్పిన్నర్లలో రవీంద్ర జడేజా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు..

37
Mohammed Shami

వరల్డ్ కప్‌లో ఈ ముగ్గురూ కీలకంగా మారతారు. జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌గా ఉంటే పాకిస్తాన్‌ని కాస్త ఇబ్బంది పెట్టగలడేమో. అయితే అతను చాలా రోజులుగా టీమ్‌కి దూరంగా ఉన్నాడు, రాగానే వరల్డ్ కప్ ఆడించడం అంటే రిస్కే అవుతుంది..

47

భారత బౌలింగ్ యూనిట్, పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేలా కనిపించడం లేదు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో చూశాం, ఆ తర్వాత ఆసియా కప్‌ 2022 టోర్నీలోనూ చూశాం. ఇండియా బ్యాటింగ్ మీదే ఆధారపడుతోంది. మాకు బౌలింగ్.. ఎందుకంటే మా బౌలింగ్ యూనిట్ చాలా డేంజరస్..

57

భారత బౌలింగ్ యూనిట్, పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేలా కనిపించడం లేదు. 2021 టీ20 వరల్డ్ కప్‌లో చూశాం, ఆ తర్వాత ఆసియా కప్‌ 2022 టోర్నీలోనూ చూశాం. ఇండియా బ్యాటింగ్ మీదే ఆధారపడుతోంది. మాకు బౌలింగ్.. ఎందుకంటే మా బౌలింగ్ యూనిట్ చాలా డేంజరస్..

67
Image credit: PTI

బ్యాటింగ్‌కీ, బౌలింగ్‌కీ మధ్య జరిగే ఫైట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నా ఉద్దేశంలో పాకిస్తాన్‌కి 60 శాతం విజయావకాశాలు ఉన్నాయి. భారత్‌లో ఆడుతున్నా, అక్కడి పిచ్‌లను బాగా వాడుకోవడం పాక్ బౌలర్లకు బాగా తెలుసు.. 
 

77

తొలుత బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్‌కి గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే భారత బ్యాటర్లను తక్కువ స్కోరుకి కట్టడి చేయగలిగితే దాన్ని ఛేదించడానికి అవసరమైన బ్యాటర్లు మా టీమ్‌లో ఉన్నారు.. ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సయిద్ అజ్మల్.. 

click me!

Recommended Stories