ధోనీ ఒక్కటే మాట చెప్పాడు, అదే నా జీవితాన్ని మార్చేసింది... భారత బౌలర్ ముకేశ్ కుమార్ కామెంట్..

First Published Jul 4, 2023, 3:52 PM IST

కథలు ఎక్కడ మొదలైనా చివరికి కంచికి చేరాల్సిందే అనేది పాత నానుడి. అలాగే ఏ క్రికెటర్ సక్సెస్ అయినా ఆ క్రెడిట్, మహేంద్ర సింగ్ ధోనీకి దక్కాల్సిందే అనేది కొత్త క్రికెట్ నానుడి... ఆఖరికి యశస్వి జైస్వాల్ సక్సెస్‌కి కూడా మాహీయే కారణమంటారు ఆయన ఫ్యాన్స్.. సాక్ష్యంగా ఎప్పుడో ఎక్కడో ధోనీతో జైస్వాల్ దిగిన ఫోటోను చూపిస్తారు..
 

Mukesh Kumar

దేశవాళీ టోర్నీల్లో అద్భుతమైన పర్పామెన్స్ చూపించి, ఐపీఎల్ 2023 సీజన్‌ వేలంలో రూ. 5 కోట్ల 50 లక్షలు దక్కించుకున్నాడు బెంగాల్ బౌలర్ ముకేశ్ కుమార్. ఐపీఎల్ 2023 సీజన్‌లో 10 మ్యాచులు ఆడి 7 వికెట్లు మాత్రమే తీసిన ముకేశ్‌‌కి, వెస్టిండీస్‌ టూర్‌లో అవకాశం దక్కింది..

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 33 మ్యాచులు ఆడి 123 వికెట్లు తీసిన ముకేశ్ కుమార్, నిలకడైన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు, డబ్ల్యూటీసీ ఫైనల్‌కి, దానికి ముందు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతనికి నెట్ బౌలర్‌గా సెలక్ట్ చేశారు..

Latest Videos


‘‘నాకు ఎప్పటినుంచే ధోనీ అంటే విపరీతమైన పిచ్చి. అతన్ని కలవగానే ఎన్నో అడగాలి, మరెన్నో తెలుసుకోవాలని అనుకుంటూ ఉండేవాడిని. ఐపీఎల్ వల్ల మాహీకి కలిసే అవకాశం దక్కింది. ధోనీని కలవగానే ముందుగా ఒకటే అడిగాను. ‘మీరు ఓ కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా మీ బౌలర్లకు ఏం చెబుతారు?’ అని...

Image credit: PTI

దానికి మాహీ నా భుజాలపైన చేయి వేసి, ‘నేను ఈ విషయం ప్రతీ బౌలర్‌కి చెబుతాను. ప్రయత్నించకపోతే, ఏదీ నేర్చుకోలేం. నువ్వేం చేయాలనుకుంటున్నావో దాన్ని భయపడకుండా చేసేయ్. ప్రయత్నిస్తేనే ఏదైనా వస్తుంది. రిజల్ట్‌తో సంబంధం లేకుండా చేయాల్సింది చేసేయ్.. ’ అన్నారు..

ఆ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి.  ఢిల్లీ క్యాపిటల్స్‌, నాకు అవకాశం ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేని మూమెంట్. ఐపీఎల్ అనుభవంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నా. చాలా మంది లెజెండరీ ప్లేయర్లతో మాట్లాడాను. ఇషాంత్ శర్మ నాకు ఎంతో సాయం చేశారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెప్పారు..

Ishant Sharma

ఏ బంతిని ఏ యాంగిల్‌లో వేయాలో నేర్పించాడు. ఓ బౌలర్‌గా సక్సెస్ కావడానికి ఏమేం చేయాలో, ఏయే విషయాల్లో ఫోకస్ పెట్టాలో ఇషాంత్ శర్మ నుంచి నేర్చుకున్నా... ఇవన్నీ నా కెరీర్‌కి ఎంతో ఉపయోగపడతాయి...’’ అంటూ కామెంట్ చేశాడు ముకేశ్ కుమార్..

click me!