ఐదు టీ20 మ్యాచుల్లో 8 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్, ఈ టీ20 సిరీస్‌లో ఇప్పటిదాకా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టాప్‌లో నిలిచాడు. మార్క్ వుడ్ 6, మహ్మద్ నవాజ్ 5 వికెట్లు తీశారు...
haris rauf
నాలుగో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లలో 3 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఇంగ్లాండ్ విజయానికి 10 బంతుల్లో 5 పరుగులు కావాల్సిన దశలో వరుస బంతుల్లో 2 వికెట్లు తీసిన హారీస్ రౌఫ్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఆ తర్వాత ఐదో టీ20 మ్యాచ్‌లో 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
‘షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్‌లతో పోల్చినంత మాత్రాన ఏ నటుడూ ఓవర్‌నైట్‌లో సూపర్ స్టార్ అయిపోడు. అలాగే షోయబ్ అక్తర్‌తో పోల్చినంత మాత్రం హారీస్ రౌఫ్ స్టార్ బౌలర్ అయిపోడు...
haris rauf
షోయబ్ అక్తర్ చాలా సార్లు టెస్టులను 2-3 ఓవర్లలో మలుపు తిప్పాడు. హారీస్ రౌఫ్ ఇప్పటిదాకా టెస్టు మ్యాచులు ఆడలేదు. ఊరికే ఫేమస్ అయిపోవచ్చేమో కానీ రికార్డులు మాత్రం అలా గాలికి కొట్టుకురావు. షోయబ్ అక్తర్ తన ఆఖరి మ్యాచ్‌లో కూడా 159.8 కి.మీ.ల వేగాన్ని అందుకున్నాడు...
హారీస్ రౌఫ్ ఇంకా కుర్రాడే, అతనికి చాలా కెరీర్ ఉంది. అతని బౌలింగ్ యాక్షన్ పూర్తిగా విభిన్నం. అతన్ని చూస్తుంటే నాకు ఏ పాత బౌలర్ గుర్తుకు రాడు. అందుకే హారీస్‌కి ఇంతటి ఆదరణ దక్కుతోంది. పాకిస్తాన్ క్రికెట్‌కి హారీస్ రౌఫ్ ఫ్యూచర్ స్టార్. అందులో ఎలాంటి అనుమానం లేదు...
haris rauf
అయితే ఓ షోయబ్ అక్తర్, వసీం అక్రమ్‌ల స్థాయికి చేరాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది. ఒకటి రెండు మ్యాచుల్లో పర్ఫామెన్స్‌తోనూ, కేవలం టీ20ల్లో పర్పామెన్స్ ఆధారంగా ఏ బౌలర్‌ని ఈ లెజెండ్స్‌తో పోల్చడం కరెక్ట్ కాదు...
టెస్టులు ఆడితే ఐదు రోజుల పాటు ఆడాల్సి ఉంటుంది. మూడు సెషన్లలో 150+ వేగంతో బౌలింగ్ వేయాల్సి ఉంటుంది. టీ20ల్లో నాలుగు ఓవర్లు వేశామన్నట్టు కాదు. అందుకే టీ20ల్లో పర్ఫామెన్స్ ఇచ్చిన వారిని, టెస్టు ప్లేయర్లతో పోల్చడం కరెక్ట్ కాదని అంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్...