IPL Auction 2022: గత ఐపీఎల్ లలో అత్యధిక ధర పలికింది వీళ్లకే.. మరి ఇప్పుడో..?

First Published Jan 17, 2022, 11:53 AM IST

Most expensive In IPL Auction: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు గా పేరున్న భారత క్రికెట్ కంట్రోల్  బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 మెగా వేలానికి సర్వం సిద్ధమవుతున్నది. 
 

ఫిబ్రవరి 12, 13వ తేదీలలో బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన ఆటగాళ్ల జాబితా ఒకసారి నెమరువేసుకుంటే.. 
 

1. దినేశ్ కార్తీక్ : టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు 2014లో ఢిల్లీ డేర్ డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ  క్యాపిటల్స్) భారీ ధరకు కొని రికార్డులు సృష్టించింది. ఆ సీజన్ లో ఢిల్లీ.. కార్తీక్ ను రూ. 12.5 కోట్లకు దక్కించుకుంది. 
 

2. బెన్ స్టోక్స్ : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అయిన బెన్ స్టోక్స్ ను  పూణె సూపర్ జెయింట్స్ జట్టు 2017లో రూ. 14.5 కోట్లకు దక్కించుకుని ఆటగాళ్ల  కొనుగోలు లో కొత్త రికార్డులు సృష్టించింది. అయితే ఆ తర్వాత పూణె ఫ్రాంచైజీ రద్దు కావడంతో స్టోక్స్.. రూ. 12.5 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు.  

3. పాట్ కమిన్స్ : ప్రస్తుత ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఐపీఎల్ 2020 వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడయ్యాడు. ఆ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతడిని రూ. 15.5 కోట్లకు దక్కించుకుంది. 
 

4. యువరాజ్ సింగ్ :  టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ 2015లో రూ. 16 కోట్లతో దక్కించుకుంది.  క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత అతడు భారీ ధర దక్కించుకోవడం విశేషం. 2014 ఐపీఎల్ లో యువీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ.. రూ. 14 కోట్లు పెట్టి కొనుక్కున్నది. 
 

5. క్రిస్ మోరిస్ : దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ అయిన మోరిస్ ను 2021 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మునుపెన్నడూ లేని విధంగా రూ. 16.5 కోట్లకు దక్కించుకుంది. అయితే గత ఐపీఎల్ సీజన్ లో అతడి ప్రదర్శన పేలవం. దీంతో రిటెన్షన్ ప్రక్రియలో అతడిని వదిలించుకుంది రాజస్థాన్. 
 

మరి ఇప్పుడు..? : గతంలో ఐపీఎల్ లో 8 జట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య పదికి చేరింది. ఐపీఎల్ లోకి కొత్తగా లక్నో, అహ్మదాబాద్ లు ఎంట్రీ ఇచ్చాయి.  ఈ జట్లు ఇప్పటికే కెప్టెన్, కోచ్, ఇతర సిబ్బందిని నియమించుకున్నాయి. 
 

లక్నో కెప్టెన్ గా కెఎల్ రాహుల్, అహ్మదాబాద్ సారథిగా హార్దిక్ పాండ్యా లు దాదాపుగా ఖరారైనట్టే.  అయితే పాండ్యా సంగతి అటుంచితే రాహుల్ కు  రూ.20 కోట్లు ఇవ్వడానికైనా  లక్నో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వేలంలోకి రాకమేందే అతడిని లక్నో దక్కించుకోనుంది. 
 

ఇక ఈ ఇద్దరితో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా  ఈసారి ఐపీఎల్ వేలంలో హాట్ కేక్ లా మారాడు. అతడి కోసం ఆర్సీబీ, కేకేఆర్, పీబీకేఎస్ లు పోటీ పడుతున్నాయి. అయ్యర్ కోసం ఈసారి వేలంలో  రూ. 20 కోట్లు ఖర్చు చేయడానికైనా ఈ మూడు ఫ్రాంచైజీలు వెనుకాడటం లేదు.  
 

click me!