టీ20లలో నా రికార్డును బ్రేక్ చేసేది అతడే : యూనివర్సల్ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అయ్యే పనేనా..?

Published : Mar 18, 2023, 09:57 PM IST

IPL 2023:  కరేబియన్ దిగ్గజం క్రిస్ గేల్ కు ఐపీఎల్ లో మంచి రికార్డులు ఉన్నాయి. గత రెండేండ్లుగా వయసు సమస్యలతో  కనిపించకపోయినా గత దశాబ్దంలో అతడి విన్యాసాలతో పులకరించని ఐపీఎల్ ఫ్యాన్ లేడంటే అతిశయోక్తి కాదు. 

PREV
16
టీ20లలో నా రికార్డును బ్రేక్  చేసేది అతడే :  యూనివర్సల్ బాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అయ్యే పనేనా..?

యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్  గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పొట్టి ఫార్మాట్  లో  చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న ఈ కరేబియన్ దిగ్గజం  ఐపీఎల్ లో అత్యధిక  వ్యక్తిగత పరుగుల రికార్డును కలిగిఉన్నాడు.  ఐపీఎల్ లో గేల్ అత్యధిక స్కోరు.. 175 నాటౌట్ గా ఉంది.  

26

2013లో గేల్.. పూణె వారియర్స్ తో  మ్యాచ్ లో  భాగంగా  66 బంతుల్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ తరఫున ఓపెనర్ గటా బరిలోకి  దిగిన గేల్.. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్ల సాయంతో  175 పరుగులు చేశాడు.  గేల్ ఈ రికార్డు సాధించి పదేండ్లు కావస్తున్నా ఐపీఎల్ లో మరే ప్లేయర్ కూడా ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా రాలేదు.  

36

ఐపీఎల్ లో కాకపోయినా మిగతా లీగ్ లలో  పలువురు ఆటగాళ్లు ఈ రికార్డుకు చేరువగా వచ్చారు.  ఆరోన్ ఫించ్  (ఆసీస్ -  172), హమిల్టన్ మసకద్జ (జింబాబ్వే - 162) ,  బ్రెండన్ మెక్‌కల్లమ్ (న్యూజిలాండ్ - 158)లతో పాటు  కొద్దిరోజుల క్రితం సౌతాఫ్రికా సంచలనం డెవాల్డ్ బ్రెవిస్ (162)  కూడా ఈ రికార్డుకు చేరువగా వచ్చాడు. కానీ  గేల్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. 

46

అయితే  ప్రస్తుతం టీ20 క్రికెట్ లో ప్రమాదకర ఆటగాళ్లుగా ఉన్న  జోస్ బట్లర్, సూర్యకుమార్ యాదవ్ లలో ఎవరైనా గేల్ రికార్డును బ్రేక్ చేస్తారా..? అని  ఫ్యాన్స్  ప్రశ్నించగా   గేల్ మాత్రం ఈ ఇద్దరి పేర్లను చెప్పలేదు. టీమిండియా వెటరన్ స్టార్  బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ కు ఈ రికార్డును బ్రేక్ చేసే సత్తా ఉందని తెలిపాడు. 

56

జియో సినిమా లో ప్రసారమవుతున్న ‘లెజెండ్  స్పీక్’ కార్యక్రమంలో  భాగంగా ఈ షోకు  హాజరైన గేల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు  చేశాడు. గేల్ మాట్లాడుతూ..‘ఆ రికార్డు (175)ను అధిగమించే సత్తా  కెఎల్ రాహుల్ కు ఉంది. కెఎల్  తనదైన రోజున  ఎలా ఆడగలడో మనందరికీ తెలుసు.  ఆ రోజున  రాహుల్ ఆ స్కోరు సాధించగలడు. మరీ ముఖ్యంగా  15 నుంచి 20 ఓవర్ల మధ్యలో అతడు చాలా  ప్రమాదకరమైన ఆటగాడు.   ఇన్నింగ్స్  మొదట్లో మంచి ఆరంభం లభిస్తే  దానిని సద్వినియోగం చేసుకుంటే మాత్రం  రాహుల్ భారీ స్కోరు చేయగలడు..’అని చెప్పాడు. 

66

అయితే  గేల్ భావించినట్టుగా  రాహుల్.. అతడి  రికార్డును బ్రేక్ చేయడమనేది లక్నో కెప్టెన్ తో అయ్యే పనేనా..? అంటున్నారు టీమిండియా అభిమానులు.  జాతీయ జట్టులో ఆడమంటే  తరుచూ విఫలమవుతూ  ఐపీఎల్ లో మాత్రం రెచ్చిపోయే ఆడే  రాహుల్..   గతంలో మాదిరిగా  ఆడటం లేదు. గత సీజన్ లో  కూడా రాహుల్ రెండు సెంచరీలు చేసినా అందులో 15వ ఓవర్ తర్వాత వచ్చినవే.  ఆ తర్వాత హిట్టింగ్ కు దిగుతూ వికెట్ పారేసుకుంటున్నాడే తప్ప వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు.  అలాంటిది రాహుల్.. గేల్ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యమయ్యేపనేనా..? అంటున్నారు అభిమానులు. ఐపీఎల్ లో రాహుల్ అత్యధిక స్కోరు.. 2020 సీజన్ లో  పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ..  ఆర్సీబీపై  132 పరుగులు చేశాడు. 

click me!

Recommended Stories