ఆ విషయంలో పూజారాని నమ్ముకుంటే అంతే! ధోనీ బెస్ట్, కానీ ఏబీడీ అంతకంటే... - విరాట్ కోహ్లీ

First Published Mar 21, 2023, 4:40 PM IST

విరాట్ కోహ్లీ తర్వాత 100 టెస్టులు ఆడిన భారత ప్లేయర్‌గా నిలిచాడు ఛతేశ్వర్ పూజారా.. కోహ్లీ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్‌లో, ఆస్ట్రేలియా టూర్‌లో విజయాలు అందుకున్న భారత జట్టులో కీలక బ్యాటర్‌గా నిలిచాడు ఛతేశ్వర్ పూజారా. జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయే పూజారా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు విరాట్ కోహ్లీ...

ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, మూడో వన్డే కోసం చెన్నై చేరుకున్నారు. మూడో వన్డేకి ముందు ఆర్‌సీబీ మాజీ టీమ్ మేట్ ఏబీ డివిల్లియర్స్‌తో కలిసి ఓ ఆన్‌లైన్ వీడియో సెషన్‌లో పాల్గొన్నాడు విరాట్ కోహ్లీ...

‘2011 వన్డే వరల్డ్ కప్ విజయాన్ని ఎప్పుడూ మరిచిపోలేను. అలాగే 2016 ఐపీఎల్ ఫైనల్, ఆ ఫీలింగ్.. ఆ క్రేజ్.. ఆ మూమెంట్‌ ఇప్పటికీ నాకు నిన్నే జరిగినట్టు అనిపిస్తుంది. గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్.. ఈ మూడు మ్యాచులు చాలా ఎంజాయ్ చేశాను..

Latest Videos


వన్డే, టీ20ల్లో ఎన్ని పరుగులు చేసినా టెస్టు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మూడున్నరేళ్ల తర్వాత అహ్మదాబాద్ టెస్టులో చేసిన సెంచరీ, నాకు చాలా రిలీఫ్‌ని ఇచ్చింది...  తర్వాతి మ్యాచ్‌ ప్రాక్టీస్‌కి ముందు గుండె వేగంగా కొట్టుకోకూడదు. బాగా ఆడామనే ఫీలింగ్ వచ్చినప్పుడే ఆ ప్రశాంతత దొరుకుతుంది..

Image credit: PTI

నేను, ఏబీ డివిల్లియర్స్ చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నాం. టెస్టు క్రికెట్‌కి నేను ఎంత విలువనిస్తాడో అతనికి బాగా తెలుసు. టీ20ల్లో, వన్డేల్లో సెంచరీలు చేసినా టెస్టుల్లో ఆడడంలో ఉండే కిక్కు వేరేగా ఉంటుంది. బ్యాటింగ్ పిచ్ మీద, సెంచరీ చేయడానికి 7-8 గంటలు తీసుకున్నావని చాలామంది అంటున్నారు. అయితే ఆస్ట్రేలియా అలా ఫీల్డ్ సెట్ చేసింది. పరుగులు చేయనివ్వకుండా నియంత్రించింది...
 

మహేంద్ర సింగ్ ధోనీకి, నాకు మధ్య చాలామంచి టెంపో ఉంటుంది. మాహీతో కలిసి బ్యాటింగ్ చేస్తుంటే, నేను సింగిల్ కోసం కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. గుడ్డిగా కళ్లు మూసుకుని పరుగెత్తొచ్చు. అయితే వికెట్ల మధ్య పరుగెత్తడంలో ఏబీ డివిల్లియర్స్ తర్వాతే ఎవ్వరైనా..
 

Virat Kohli and Ab de Villiers

అతను నాకంటే వేగంగా వికెట్ల మధ్య పరుగెడతాను. కొన్నిసార్లు నేను కూడా అతనితో పరుగులు తీయడానికి వేగాన్ని అందుకోలేక అవుట్ అయిపోతానేమోనని భయపడ్డాను.. ఇక వికెట్ల మధ్య పరుగెత్తడంలో వరస్ట్ రన్నర్ అంటే ఛతేశ్వర్ పూజారా. అతన్ని నమ్మి పరుగెట్టాలంటే భయమేస్తుంది...

పూజారాకి ఓపిక చాలా ఎక్కువ. క్విక్ సింగిల్స్ తీయాల్సిన అవసరం ఏముందని అతను నమ్ముతాడు. అందుకే పూజారాతో బ్యాటింగ్ చేస్తే, అతను పిలిచే దాకా నాన్‌స్ట్రైయికింగ్‌లో పడుకోవచ్చు... అంత టైమ్ ఉంటుంది.’ అంటూ నవ్వేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 

click me!