ఒకే టీమ్‌లో రిజ్వాన్, పూజారా... పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆడబోతున్న పూజారా...

Published : Mar 11, 2022, 04:25 PM IST

గత రెండేళ్లుగా సరైన పర్ఫామెన్స్ ఇవ్వలేక, వరుసగా విఫలమవుతూ టీమిండియాలో చోటు కోల్పోయాడు ఛతేశ్వర్ పూజారా. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో, సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా ఓటమికి మిడిల్ ఆర్డర్‌లో పూజారా, రహానే వైఫల్యమే కారణం...

PREV
112
ఒకే టీమ్‌లో రిజ్వాన్, పూజారా...  పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి ఆడబోతున్న పూజారా...

శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్‌కి ఛతేశ్వర్ పూజారాతో పాటు అజింకా రహానేని కూడా పక్కనబెట్టేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...

212

వీరి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్ తొలి టెస్టులో ఆకట్టుకున్నారు. హనుమ విహారి హాఫ్ సెంచరీతో రాణించగా, శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...

312

రంజీ ట్రోఫీలో ఫామ్ నిరూపించుకుని, టీమిండియాలోకి తిరిగి ఎంట్రీ ఇవ్వవచ్చని ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలకు ముందుగానే సూచించింది బీసీసీఐ...

412

అయితే అజింకా రహానే, ఛతేశ్వర్ పూజారా ఇద్దరూ రంజీ ట్రోఫీలో కూడా ఫామ్‌ని నిరూపించుకోవడంలో ఫెయిల్ అయ్యారు. 

512

మూడు మ్యాచుల్లో కలిసి చెప్పుకోదగ్గ పరుగులు చేయలేక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో టాప్ 15లో కూడా చోటు దక్కించుకోలేకపోయారు...

612

రంజీ ట్రోఫీలో కూడా ఫెయిల్ కావడంతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను మార్గంగా ఎంచుకున్నాడు ఛతేశ్వర్ పూజారా...

712

గత ఏడాది ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు పూజారాని కొనుగోలు చేసింది. దీంతో కౌంటీలకు దూరమయ్యాడు పూజారా...

812

ఈసారి పూజారా, ఐపీఎల్ ఆశలు పెట్టుకున్నా ఫ్రాంఛైజీలేమీ ఈ టెస్టు ప్లేయర్‌ని కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో ఈసారి కౌంటీల్లో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నాడు పూజారా...

912

ఇంతకుముందు డర్బీషైర్, యార్క్‌షైర్, నాటింగ్‌హమ్‌షైర్ వంటి కౌంటీ టీమ్స్‌కి ఆడిన ఛతేశ్వర్ పూజారా, ఈసారి సుసెక్స్ తరుపున బరిలో దిగబోతున్నాడు...

1012

పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ మహ్మద్ రిజ్వాన్ కూడా కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో సుసెక్స్ టీమ్ తరుపున బరిలో దిగుబోతున్నట్టు ప్రకటించాడు...

1112

పాక్ ప్లేయర్ రిజ్వాన్, భారత ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా కలిసి ఒకే టీమ్‌ తరుపున బరిలో దిగబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది... ఇప్పటికే కౌంటీ ఛాంపియన్‌షిప్ గురించి రెండు దేశాల్లో చర్చ మొదలైంది...

1212

అయితే జూన్‌లో వెస్టిండీస్‌తో కలిసి స్వదేశంలో వన్డే సిరీస్ ఆడనుంది పాకిస్తాన్. దీంతో రిజ్వాన్‌, ఏప్రిల్ 7న మొదలయ్యే కౌంటీ సీజన్ మధ్యలోనే స్వదేశానికి రానున్నాడు...

click me!

Recommended Stories