అలా చేస్తే ధోనీ కమ్‌బ్యాక్ గ్యారెంటీ.. అజిత్ అగార్కర్ కామెంట్...

First Published Oct 22, 2020, 10:03 PM IST

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరిన సీఎస్‌కే, 8 సార్లు ఫైనల్ ఆడింది. ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచి మూడు సార్లు టైటిల్ కైవసం చేసుకుంది. అయితే అదంతా గతం...

ఈ సీజన్‌లో మొట్టమొదటిసారి ప్లేఆఫ్‌కు దాదాపు దూరమైపోయింది చెన్నై సూపర్ కింగ్స్...
undefined
ఐపీఎల్‌లో తన కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌ జట్టును ఫైనల్ చేర్చిన ధోనీ, రెండోసారి గ్రూప్ స్టేజ్‌కే పరిమితం కాబోతున్నాడు...
undefined
ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులను గెలిపించిన మహేంద్ర సింగ్ ధోనీతో పాటు కేదార్ జాదవ్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతున్నారు...
undefined
అదీకాకుండా ఛీటింగ్ చేయాలని ప్రయత్నిస్తూ, చాలాసార్లు అడ్డంగా దొరికిపోయాడు మహేంద్ర సింగ్ ధోనీ... దీంతో మాహీపై విమర్శల వర్షం కురుస్తోంది.
undefined
అయితే భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ మాత్రం ధోనీ బ్యాటింగ్ ఆర్డర్ వల్లే సీఎస్‌కేకి ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నాడు...
undefined
బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసి ఐదో స్థానం కంటే ముందు ధోనీ బ్యాటింగ్‌కి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ కష్టాలన్నీ తీరిపోతాయని అంటున్నాడు...
undefined
అయితే భారీ షాట్లు ఆడేందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined
అప్పుడెప్పుడో రాజస్థాన్‌పై కొట్టిన హ్యాట్రిక్ సిక్సర్లు తప్ప, మరో మ్యాచ్‌లో మహీ బ్యాటు నుంచి భారీ షాట్లు చూసే భాగ్యం దక్కలేదు అభిమానులకు...
undefined
అలాంటిది ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో పైన వస్తే మాత్రం... భారీ షాట్లు ఆడి రాణించగలుగుతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఐపిఎల్ ఫ్యాన్స్...
undefined
సురేశ్ రైనా గైర్హజరీని ఎక్కువగా ఫీల్ అవుతున్నట్టు మహేంద్ర సింగ్ ధోనీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. మరి మిగిలిన మ్యాచుల్లో అయినా విజయాలు సాధిస్తే ధోనీ ముఖంలో మునుపటి మెరుపు చూసే అవకాశం దొరుకుతుంది.
undefined
click me!