చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ సీక్రెట్ ఇదే! ఈసారి కూడా కమ్‌బ్యాక్ ఇచ్చి తీరుతాం... - ఆల్బీ మోర్కెల్...

First Published | Jan 13, 2023, 6:31 PM IST

ఐపీఎల్ 2020 సీజన్‌లో వరుస పరాజయాలతో మొట్టమొదటిసారిగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది చెన్నై సూపర్ కింగ్స్. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన సీఎస్‌కే, 2021 సీజన్‌లో ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చింది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో మరోసారి తన స్టైల్‌లో అదరగొట్టిన మాహీ టీమ్, నాలుగోసారి టైటిల్ గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. అయితే 2022 సీజన్‌లో మరోసారి సీఎస్‌కే జట్టుకి నిరాశే ఎదురైంది...

Image credit: PTI

రవీంద్ర జడేజా కెప్టెన్సీలో 2022 సీజన్‌ని ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్, వరుసగా 4 పరాజయాలు అందుకుంది. 8 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న సీఎస్‌కే, మిగిలిన ఆరు మ్యాచులను ధోనీ కెప్టెన్సీలో ఆడింది...


Image credit: PTI

10 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ కమ్‌బ్యాక్ ఇవ్వడం చూస్తారని అంటున్నాడు ఆ జట్టు మాజీ క్రికెటర్ ఆల్బీ మోర్కెల్...
 

Joburg

సౌతాఫ్రికా 20 లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ టీమ్‌ని ప్రవేశపెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. జోబర్గ్ సూపర్ కింగ్స్‌కి అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు ఆల్బీ మోర్కెల్.. ‘సౌతాఫ్రికాలో టీ20 లీగ్ మొదలెట్టాలని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నా. అయితే ఇప్పటికి వర్కవుట్ అయ్యింది...

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీలో ప్లేయర్లకు, కోచ్‌లకు కావాల్సినంత స్వేచ్ఛ ఉంటుంది. అందుకే సీఎస్‌కే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్‌గా మారింది. సీఎస్‌కే ఈసారి కూడా కమ్‌బ్యాక్ ఇస్తుంది...

albie morkel in csk

సౌతాఫ్రికాలో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఇలాగే సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది..సౌతాఫ్రికా క్రికెట్‌కి ఈ లీగ్ ఎంతో ఉపయోగపడుతుంది. కొత్త ప్లేయర్లు వెలుగులోకి వస్తారు. ఈ లీగ్స్ మాత్రమే ఆడే ప్లేయర్ల సంఖ్య పెరుగుతుందని అనుకుంటున్నా...’ అంటూ కామెంట్ చేశాడు జోబర్గ్ సూపర్ కింగ్స్ అసిస్టెంట్ కోచ్ ఆల్బీ మోర్కెల్.. 

Latest Videos

click me!