చెన్నై సూపర్ కింగ్స్‌లో నన్ను బాగా గారాబం చేసేవాళ్లు, అందుకే - సురేష్ రైనా కామెంట్...

First Published Jan 28, 2023, 4:34 PM IST

ఐపీఎల్ చరిత్రలో 5 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్ సురేష్ రైనా... చెన్నై సూపర్ కింగ్స్‌కి నాలుగు టైటిల్స్ అందించిన సురేష్ రైనా, ధోనీకి అత్యంత ఆప్తుడిగా, ‘చిన్న తలా’గా పేరు తెచ్చుకున్నాడు. ధోనీతో కలిసి ఎన్నో మ్యాచులు గెలిపించిన సురేష్ రైనా,  అయితే కెరీర్ ముగింపు దశలో  సీఎస్‌కేలో దక్కాల్సిన గౌరవం దక్కించుకోలేకపోయాడు..

ఐపీఎల్ 2020 సీజన్‌ ఆరంభంలో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా, వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వచ్చేశాడు. దోపిడి దొంగల దాడిలో తన మామ హత్యకు గురి కావడంతో దుబాయ్ నుంచి తిరిగొచ్చిన రైనా, మళ్లీ జట్టుతో కలవలేదు...

యూఏఈలో సురేష్ రైనా, సముద్ర వ్యూ ఉన్న బాల్కనీ కావాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ని కోరాడని... అయితే అది ధోనీకి కేటాయించడంతో అలిగి సీజన్ మొత్తానికి దూరమయ్యాడని వార్తలు వచ్చాయి.. 
 

Image Credit: Getty Images

2021 ఐపీఎల్ సీజన్‌లో జట్టులోకి వచ్చినా, పెద్దగా రాణించలేకపోయాడు రైనా... రాబిన్ ఊతప్ప కారణంగా నాకౌట్ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2022 ఐపీఎల్ మెగా వేలంలో సురేష్ రైనాని ఏ జట్టూ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...

‘సీఎస్‌కే ప్లేయర్లను సొంత కుటుంబంలా చూసుకుంటుంది. కేవలం ప్లేయర్లకు మాత్రమే కాదు, వారి కుటుంబాలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. చాలా బోనస్‌లు ఇస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఓ పిల్లాడిని బుజ్జిగిస్తున్నట్టు..
 

చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యేవాడిని. నన్ను చాలా గారాబంగా చూసుకునేవాళ్లు... అందుకే సీఎస్‌కే తరుపున ఆడానని చాలా గర్వంగా చెప్పుకుంటాను...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా...

సురేష్ రైనా ప్లేస్‌కి చెక్ పెట్టిన రాబిన్ ఊతప్ప కూడా చెన్నై సూపర్ కింగ్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ‘చెన్నై సూపర్ కింగ్స్‌లో చాలా సెక్యూరిటీ ఉంటుంది. రిజర్వు బెంచ్‌లో కూర్చున్నా సరే, మనల్ని తప్పించారనే ఫీలింగ్ కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు...

Dhoni-Uthappa

ప్లేయర్లను ఎలా గౌరవించాలో చెన్నై సూపర్ కింగ్స్‌కి బాగా తెలుసు. అందుకే 12 మ్యాచులు ఆడకపోయినా ఆఖర్లో అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నన్ను ఎలా వాడుకోవాలో టీమ్‌కి బాగా తెలుసు...’ అంటూ కామెంట్ చేశాడు రాబిన్ ఊతప్ప.. 

click me!