సారథుల సంపాదన ఎంతో తెలుసా..? అత్యధికంగా సంపాదించేది అతడే..

Published : Jul 08, 2022, 07:02 PM ISTUpdated : Jul 08, 2022, 07:03 PM IST

Captains Net Worth: జట్టును ముందుండి నడిపించడంలో  సారథులది కీలక పాత్ర. విజయమైనా ఓటమైనా.. వాళ్లదే బాధ్యత. ఒక జట్టులో ఆటగాడుగా ఉంటే ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన పన్లేదు. కానీ కెప్టెన్ అయితే మాత్రం సవాలక్ష మందికి సమాధానం చెప్పాలి. 

PREV
116
సారథుల సంపాదన ఎంతో తెలుసా..? అత్యధికంగా సంపాదించేది అతడే..

నిత్యం బిజీబిజీగా జట్టు కూర్పు, తర్వాత మ్యాచులలో అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ ప్రణాళికలు అంటూ లెక్కలేసుకునే  సారథులు దేశం మొత్తానికి జవాబుదారీగా ఉండాలి. విజయాలొస్తే ఏంకాదు గానీ అపజయాలు వస్తే మాత్రం దేశం మొత్తం వేళ్లన్నీ వాళ్ల వైపే చూపిస్తాయి.  మరి ఇంత భారాన్ని మోస్తున్న సారథుల సంపాదన ఎంత..?  ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. 

216

ఆరోన్ ఫించ్  (ఆసీస్ వన్డే, టీ20 కెప్టెన్) : అగ్రశ్రేణి ఆస్ట్రేలియా జట్టుకు పరిమిత ఓవర్లలో  కెప్టెన్ గా ఉన్న ఆరోన్ ఫించ్ ఆస్తుల నికర విలువ (నెట్ వర్త్)  రూ. 63.4 కోట్లు (8 మిలియన్ డాలర్లు) అని CAknowledge నివేదికలో పేర్కొంది. 

316

ప్యాట్ కమిన్స్ (ఆసీస్ టెస్ట్ కెప్టెన్) : ఆస్ట్రేలియాకు టెస్టులలో సారథ్య బాధ్యతలు మోస్తున్న కమిన్స్ సంపాదన రూ. 356 కోట్లు (45 మిలియన్ డాలర్లు) అని ఖేల్ తక్ లెక్కగట్టింది. కెప్టెన్లందరిలో అత్యధికంగా నెట్ వర్త్ ఉన్న ఆటగాడు ప్యాట్ కమిన్సే కావడం విశేషం. 
 

416

టెంబ బవుమా (దక్షిణాఫ్రికా వన్డే, టీ20 కెప్టెన్) : సఫారీ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో సారథిగా  ఉన్న టెంబ బవుమా సంపాదన  రూ. 21 కోట్లు (3 మిలియన్లు) అని Primes World  నివేదిక ద్వారా తెలుస్తున్నది. 
 

516

డీన్ ఎల్గర్ : సఫారీ టెస్టు జట్టుకు సారథిగా ఉన్నడీన్ ఎల్గర్ వార్షిక సంపాదన  గురించి స్పష్టమైన సమాచారం లభ్యం కాలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం అతడి  ఆస్తుల విలువ 2 నుంచి 8 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 

616

కేన్ విలియమ్సన్ : న్యూజిలాండ్ జట్టుకు ఆల్ ఫార్మాట్ గా ఉన్న కేన్ మామ సంపాదన రూ. 79 కోట్లు (10 మిలియన్ డాలర్లు) ఇందులో ఐపీఎల్ సంపాదన కూడా ఉందని WeKnowCricket క్రికెట్ నివేదిక లో వెల్లడైంది. 

716

జోస్ బట్లర్ : ఇంగ్లాండ్  పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లకు ఇటీవలే కెప్టెన్ గా నియమితుడైన జోస్ బట్లర్ సంపాదన కూడా కేన్ మామ మాదిరే రూ. 79 కోట్లుగా ఉంది. 

816

బట్లర్ కు వచ్చినంతే ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి బెన్ స్టోక్స్ కూడా  రూ. 79 కోట్ల ఆదాయం కలిగిఉన్నాడని CAknowledge నివేదిక లో పేర్కొంది. 

916

బాబర్ ఆజమ్ : పాకిస్తాన్ ఆల్ ఫార్మాట్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 39 కోట్లు (5 మిలియన్ డాలర్లు) అనిSports Lite నివేదిక పేర్కొంది. 

1016

దసున్ శనక : శ్రీలంక పరిమిత ఓవర్ల సారథి దసున్ శనక కు ఆస్తుల  విలువ రూ. 11 కోట్లు (1.5 మిలియన్ డాలర్లు) గా ఉందని Networthy  నివేదిక ద్వారా తెలుస్తున్నది. 

1116
Dimuth Karunaratne

దిముత్ కరుణరత్నె : శ్రీలంక టెస్టు జట్టు సారథి కరుణరత్నె కు కూడా శనక మాదిరిగానే  రూ. 11 కోట్ల ఆదాయం ఉందని BIO GOSSIPY నివేదిక తెలిపింది. 
 

1216

nicholas pooran

నికోలస్ పూరన్ : వెస్టిండీస్ జట్టకు ఇటీవలే సారథిగా నియమితుడైన పూరన్ సంపాదన  రూ. 7.9 కోట్లు (1 మిలియన్ డాలర్లు) అని Sports Lite తెలిపింది. అయితే ఇందులో ఐపీఎల్ ఆదాయం కలపలేదని తెలుస్తున్నది. 

1316

క్రెయిగ్ బ్రాత్ వైట్ : విండీస్ టెస్టు జట్టుకు సారథిగా ఉన్న క్రెయిగ్ బ్రాత్ వైట్ ఆస్తుల విలువను ఖేల్ తక్ రూ. 23 కోట్లు గా లెక్కగట్టింది. 

1416

మహ్మదుల్లా : బంగ్లాదేశ్ టీ20 సారథి మహ్మదుల్లా ఆస్తుల విలువ  రూ. 11.8 కోట్లు (1.5 మిలియన్ డాలర్లు) అని SurpriseSports నివేదిక తెలిపింది.  

1516
Image Credit: Getty Images

బంగ్లాదేశ్ వన్డే సారథి తమీమ్ ఇక్బాల్ ఆదాయం గురించి కూడా స్పష్టమైన సమాచారం లేదు. అతడి సంపాదన 3-5 మిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. మరోవైపు  ఆ జట్టు టెస్టు కెప్టెన్ షకిబ్ అల్ హసన్ సంపాదన భారీగా ఉంది.  సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్న షకిబ్  మొత్తం సంపాదన రూ. 317 కోట్లు అని  Net Worth Idea లెక్కగట్టింది. అయితే  ఏడాదికి అతడు ఎంత సంపాదిస్తాడనేది మాత్రం వెల్లడించలేదు. 

1616

రోహిత్ శర్మ (టీమిండియా కెప్టెన్) : భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ  ఆస్తుల నికర విలువ రూ. 190 కోట్లు (ఐపీఎల్ కాంట్రాక్ట్, బీసీసీఐ కాంట్రాక్టులు, ఎండార్స్మెంట్స్ తదితరాల ద్వారా అందే మొత్తం) అని CAknowledge నివేదికలో తేలింది. 

Read more Photos on
click me!

Recommended Stories