ఐపీఎల్ డిజిటల్ మీడియా రైట్స్‌ని రూ.23,773 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో సరికొత్త విప్లవాన్ని తీసుకురానుంది. అత్యుత్తమ 4K రిజల్యూషన్‌లో ఐపీఎల్ మ్యాచులు ఉచితంగా ప్రసారం చేయనున్న జియో... ఇప్పుడు మరిన్ని సదుపాయాలను వినియోగదారులకు అందుబాటులో తేనుంది..