గాయం చేసి, నొప్పి తెలియకుండా మందు రాసినట్టు... ఘోర ఓటముల తర్వాత సెంచరీలా! కోహ్లీ, సూర్య, ఇషాన్...

First Published Dec 10, 2022, 4:45 PM IST

గాయం చేసి నొప్పి తెలియకుండా మందు రాయడం ఓ పెద్ద ఆర్ట్. ఇప్పుడు టీమిండియా చేస్తున్నది కూడా ఇదేనంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. చిత్తుగా ఓడిన తర్వాత చెత్తగా ఆడుతున్నారని విమర్శలు రాగానే... ఆ తర్వాతి మ్యాచ్‌లో సెంచరీలు బాది, అభిమానులను సైలెంట్ చేస్తోంది టీమిండియా... ఆసియా కప్ 2022 టోర్నీ నుంచి ఇదే సీన్ రిపీట్ అవుతూ వస్తోంది...

India vs Pakistan

ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియానే టైటిల్ విజేత అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. వరుసగా ద్వైపాక్షిక సిరీసులు గెలుస్తూ వస్తున్న రోహిత్ సేన జోరుకి బ్రేకులు వేయ్యడం ఎవ్వరి వల్లా కాదనుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ 4 రౌండ్‌లో పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడింది టీమిండియా...

virat kohli

టీమిండియా వైఫల్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ అండ్ కో తీవ్రమైన ట్రోలింగ్ ఫేస్ చేశారు. ఈ సమయంలో ఆఫ్ఘాన్‌పై సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. మూడేళ్లుగా 71వ సెంచరీని అందుకోలేకపోతున్న విరాట్.. ఆఫ్ఘాన్‌పై శతకం బాదడంతో అప్పటిదాకా టీమిండియా ప్రదర్శనపై వచ్చిన విమర్శలకు ఫుల్‌స్టాప్ పడింది...

టీమిండియా పరాజయాన్ని మరిచిపోయి విరాట్ కోహ్లీ సెంచరీ గురించి, అతని వీరోచిత బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవడం మొదలెట్టారు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో టీమిండియా గ్రూప్ స్టేజీలో బాగానే ఆడింది. అయితే ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో దారుణ పరాజయాన్ని చవిచూసింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ మినహా భారత బ్యాటింగ్, బౌలింగ్ విభాగం ఘోరంగా ఫెయిల్ అయ్యింది...

టీమిండియా ఘోర ప్రదర్శన గురించి, రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి... హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ప్రయోగాలతో టీమ్‌ని నాశనం చేస్తున్న విధానం గురించి తీవ్రమైన చర్చ జరిగింది. రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకుని హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ వినిపించింది...

సరిగ్గా ఇదే సమయంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో సెంచరీతో చెలరేగాడు సూర్యకుమార్ యాదవ్. అంతకుముందు ఇంగ్లాండ్ టూర్‌లో సెంచరీ బాదిన సూర్య, కివీస్‌పై సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడడంతో టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో టీమిండియా పరాభవాన్ని మరిచిపోయారు అభిమానులు...
 

Rohit Sharma

న్యూజిలాండ్ టూర్ తర్వాత బంగ్లాలో అడుగుపెట్టిన భారత జట్టు, తొలి రెండు వన్డేల్లో చిత్తుగా ఓడి సిరీస్ కోల్పోయింది. భారత జట్టు, మరీ బంగ్లా చేతుల్లో ఇలా ఓడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. తొలి వన్డేలో ఆఖరి వికెట్ తీయలేక ఓడిన టీమిండియా, రెండో వన్డేలో ఆఖరి బంతికి 6 కొట్టలేక ఓడింది...

ishan

రెండో వన్డేలో గాయపడిన తర్వాత క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ, ట్రోలింగ్ నుంచి తప్పించుకున్నాడు. రోహిత్ వీరోచిత పోరాటం వల్ల టీమిండియా చెత్త ఆటను పట్టించుకోలేదు అభిమానులు. బంగ్లాపై సిరీస్ ఓడిపోయి, తీవ్ర విమర్శలు వచ్చిన సమయంలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు...

వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండరీ అవతల పడేసి 24 ఏళ్ల వయసులోనే కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడేశాడు. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లీ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ డబుల్ సెంచరీ, సెంచరీల హడావుడిలో బంగ్లాతో వన్డే సిరీస్ ఓడిన విషయాన్ని మరిచిపోయారు అభిమానులు...

Suryakumar Yadav

చూస్తుంటే గెలవాల్సిన మ్యాచుల్లో ఆడలేక చేతులు ఎత్తేసి...  జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయాక, మేం ఆడగలమని నిరూపించుకోవడానికి సెంచరీలు కొడుతున్నట్టుగా టీమిండియా ఆటతీరు ఉందని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు. క్రికెటర్ అభిమానులకు తమ ఫెవరెట్ క్రికెటర్ సెంచరీ చేస్తే చాలు, కానీ టీమిండియా ఫ్యాన్స్‌కి జట్టు గెలవడం కూడా కావాలి...

మూడో వన్డేలో మనోళ్లు ఇరగదీశారు. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ సాధించి, వన్డేల్లో తానేం చేయగలడో నిరూపించుకున్నాడు. అయితే రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా కోలుకున్నాక, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ తిరిగి వచ్చాక ఇషాన్ కిషన్‌కి టీమ్‌లో చోటు ఉంటుందన్న గ్యారెంటీ ఉందా? అది ఆ అమిత్ షా కొడుక్కి మాత్రమే తెలుసేమో...  అంటున్నారు నెటిజన్లు.

click me!