కెఎల్ రాహుల్ ప్లేస్‌లో టీమిండియాకి ఆడాల్సిన వాడు! ఫ్యామిలీ ఫ్రెషర్‌తోనే అఖిల్, హీరో అయ్యాడంటూ...

Published : Feb 20, 2023, 04:21 PM IST

ఇప్పుడు టీమిండియాలో మీమీ మెటిరియల్‌గా మారిపోయాడు కెఎల్ రాహుల్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి రెండు టెస్టుల్లో కెఎల్ రాహుల్ ఫెయిల్ అవ్వడంతో అతనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో అఖిల్‌ని కూడా కెఎల్ రాహుల్ కంటే బెటర్ ప్లేయర్‌గా పోలుస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు...

PREV
17
కెఎల్ రాహుల్ ప్లేస్‌లో టీమిండియాకి ఆడాల్సిన వాడు! ఫ్యామిలీ ఫ్రెషర్‌తోనే అఖిల్, హీరో అయ్యాడంటూ...
Akhil

కేరళ స్ట్రైయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని, బ్యాటుతో చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లో 91 పరుగులు చేసేశాడు అఖిల్. 20 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేసిన అఖిల్, తన హాఫ్ సెంచరీలో ఆడింది నాలుగంటే నాలుగు డాట్ బాల్స్..

27
Akhil

అఖిల్ అక్కినేని ఆడుతుంటే నాన్‌స్ట్రైయికర్ ఎండ్‌లో బ్యాటర్లు, ‘ఇతను ఎలాగో స్ట్రైయిక్ ఇవ్వడు’ అని ఫిక్స్ అయిపోయి, కూర్చోవడం టీవీల్లో స్పష్టంగా కనిపించింది. అఖిల్ వన్ మ్యాన్ షో కారణంగా కేరళ స్ట్రైయికర్స్‌పై 64 పరుగుల భారీ తేడాతో విజయం అందుకుంది తెలుగు వారియర్స్..

37

‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన అఖిల్ అక్కినేని, నిజానికి క్రికెటర్ కావాల్సిన వాడు అని, కేవలం అక్కినేని నాగార్జున ఒత్తిడి చేయడం వల్లే ఇష్టం లేకపోయినా సినిమాల్లో నటిస్తున్నాడని ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంకొంచెం ప్రాక్టీస్ చేసి ఉంటే, కెఎల్ రాహుల్ ప్లేస్‌లో టీమిండియాకి ఓపెనర్‌గా ఆడేవాడని మీమ్స్ వైరల్ చేస్తున్నారు...
 

47

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో బౌలింగ్ చేసేది కూడా యాక్టర్లే. వారికి పెద్దగా బౌలింగ్ వచ్చే అవకాశం లేదు. అలాంటి వారి బౌలింగ్‌లో క్రికెట్ అకాడమీలో ట్రైయినింగ్ తీసుకున్న అఖిల్, ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం చాలా సాధారణ విషయం. తరుణ్ కూడా ఇదే విధంగా ఆడేవాడు. అయితే ప్రొఫెషనల్ బౌలర్ల బౌలింగ్‌లో అఖిల్ ఇలా ఆడగలడా? అనేది అనుమానమే..

57

2010లో టాలీవుడ్ టీ20 ట్రోఫీ నిర్వహించిన సమయంలోనే అఖిల్ బ్యాటింగ్ గురించి పెద్ద చర్చ జరిగింది. అప్పటికి టీనేజ్ వయసులో ఉన్న అఖిల్, క్రికెట్‌లో వెళ్లాలని అనుకుంటున్నాడని స్వయంగా నాగార్జున కూడా కామెంట్ చేశాడు. సినిమాల్లో వారసత్వం వర్కవుట్ అవుతుంది కానీ క్రికెట్‌లో కాదు...
 

67

‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్, ముంబై టీమ్‌లో ప్లేస్ దక్కడం లేదని గోవా తరుపున ఆడుతున్నాడు. అందుకేనేమో నాగార్జున, తెలివిగా అఖిల్‌ని సినిమాల్లోకి లాగేశాడు. ‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు, ఇప్పటికి మూడు సార్లు రీఇంట్రడ్యూస్ అయ్యాడు..

77

‘హాలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు డిజాస్టర్ ఫలితాలను ఇచ్చినా ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’ సినిమాతో తొలి హిట్టు కొట్టేశాడు అఖిల్. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదల కానుంది.. 

click me!

Recommended Stories