‘అండర్ - 16 ప్లేయర్లు కూడా ఇంత అధ్వాన్నంగా ఆడరు.. మీరు వరల్డ్ నెంబర్ వన్ టీమ్ ఎలా అయ్యారో మరి..’

Published : Feb 20, 2023, 04:19 PM IST

Border Gavaskar Trophy 2023: భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది.   గత రెండు టెస్టులలోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు  స్పిన్ ఆడలేక చేతులెత్తేశారు. 

PREV
17
‘అండర్ - 16 ప్లేయర్లు కూడా ఇంత అధ్వాన్నంగా ఆడరు.. మీరు  వరల్డ్ నెంబర్ వన్ టీమ్ ఎలా అయ్యారో మరి..’

టెస్టులలో వరల్డ్ నెంబర్ టీమ్ గా  భారత్ లో అడుగుపెట్టి ‘ఈసారి టీమిండియాకు షాకులిస్తాం.. ట్రోఫీని  తీసుకెళ్తాం..’ అని గొప్పలకు పోయిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు భారత్  తో అంత ఈజీ కాదని గట్టిగానే తెలిసొచ్చింది.  నాగ్‌పూర్ టెస్టులో భారత స్పిన్నర్లు ట్రైలర్ మాత్రమే చూపారు కానీ ఢిల్లీ టెస్టులో  వారికి  సినిమా ఎలా ఉంటుందో కూడా అర్థమైపోయి ఉంటుంది.  
 

27

రెండు టెస్టులలో తొలి ఇన్నింగ్స్ లో  ఉన్నంతలో కాస్త బెటర్ గా ఆడిన కంగారూలు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చేతులెత్తేశారు.  నాగ్‌పూర్ లో రెండో ఇన్నింగ్స్ లో వంద కూడా కొట్టలేకపోయిన ఆ జట్టు.. ఢిల్లీలో అతి బలవంతం మీద  వంద దాటింది.  రెండు సందర్భాల్లోనూ భారత స్పిన్నర్ల స్పిన్ ఉచ్చులో బంధీ అయింది. 

37

ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో  ఆ జట్టు బ్యాటర్లు రివర్స్ స్వీప్, స్వీప్ షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకున్నారు.  ఆ జట్టులో చివరి  ఏడుగురు బ్యాటర్లలో ఐదుగురు ఇలా ఔటైన వారే.  కాగా ఆస్ట్రేలియా చెత్త బ్యాటింగ్ పై ఆ జట్టు మాజీలే కాదు.. భారత  క్రికెట్ మాజీ ఆటగాళ్లు  కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ నెంబర్ వన్ టీమ్ గా వచ్చి  ఇంత చెత్త ఆడటం  దారుణమని  అంటున్నారు. 
 

47

ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిశాక ఇదే విషయమై   టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మాట్లాడుతూ.. ‘రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లు  తమ జట్టుకు చాలా పెద్ద ముప్పు అని ఆస్ట్రేలియాకు తెలుసు. వారిని ఎదుర్కోవడానికి  కంగరూలు సిద్ధమయ్యే వచ్చారు. కానీ వాళ్లు బ్యాటింగ్ చేస్తున్న తీరును చూస్తే దారుణంగా ఉంది.   

57

వరల్డ్ నెంబర్ జట్టు  బ్యాటర్లు ఆడే ఆట కాదు ఇది. అండర్ -16 స్థాయి ప్లేయర్లు కూడా ఇంత అధ్వాన్నంగా ఆడరు.  బంతి టర్న్ అవుతున్న పిచ్ పై   చెత్త షాట్ సెలక్షన్స్ తో వికెట్లను సమర్పించుకున్నారు.  అసలు వాళ్లు స్వీప్స్, రివర్స్ స్వీప్స్ ఎందుకు ఆడుతున్నారో నాకైతే అర్థం కాలేదు.  

67

స్పిన్ బౌలింగ్ లో   బంతిని డిఫెన్స్ చేసేప్పుడో లేక  టెక్నిక్ లోపం వల్లో ఔట్ అవడం  సాధారణమే. కానీ ఇలాంటి షాట్లు ఆడొద్దని డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కూడా అవే షాట్లు ఆడి వికెట్లు సమర్పించుకోవడం చూస్తే ఏమనాలి..? ఈ టెస్టులో  తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ తరఫున  మెరుగ్గా ఆడిన హ్యాండ్స్‌కోంబ్ గానీ  భారత బ్యాటర్లు గానీ ఎన్నిసార్లు స్వీప్ షాట్లు ఆడారు..? కానీ రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బ్యాటర్లంతా ఈ షాట్లను ఆడారు. 

77

మీరు ఆడుతున్నది అండర్ -14 బౌలర్లపై కాదు.  వాళ్లు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్పిన్నర్లు.  బంతి మిస్ అయితే వికెట్లు పోతాయని తెలిసి కూడా ఇలా ఆడారంటే ఇది కేవలం బౌలర్లకు సరెండర్ అవడమే తప్ప మరొకటి లేదు..’అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఈ టెస్టులో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత    ఆసీస్ మాజీ క్రికెటర్ మార్క్ వా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. 

click me!

Recommended Stories