జో రూట్ చేయలేని పని, మోర్గాన్ చేస్తాడు... అతను మహేంద్ర సింగ్ ధోనీతో సమానం...

First Published Mar 11, 2021, 2:37 PM IST

టెస్టు సిరీస్‌లో 1-3 తేడాతో చిత్తుగా ఓడిన ఇంగ్లాండ్ జట్టు, టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. జో రూట్ కెప్టెన్సీలో మొదటి టెస్టులో భారీ విజయం అందుకోగా, ఆ తర్వాత మూడు మ్యాచుల్లో చిత్తుగా ఓడింది ఇంగ్లాండ్... 

టీమిండియా టూర్‌లో టెస్టు కెప్టెన్ జో రూట్ సాధించలేని దాన్ని, పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చేసి చూపెడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు గ్రేమ్ స్వాన్, మైఖేల్ వాన్...
undefined
ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 2019లో వన్డే వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మోర్గాన్‌ను ధోనీతో పోల్చాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...
undefined
‘ఇయాన్ మోర్గాన్ జట్టు మంచి సిరీస్ ఆడబోతోంది. అతనో అద్భుతమైన లీడర్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, ఫీల్డర్‌గా అతను జట్టులో మంచి ఉత్సాహం నింపుతాడు...
undefined
మహేంద్ర సింగ్ ధోనీ, టీమిండియాకు ఎలా ఉపయోగపడ్డాడో, ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్‌కి అలా ఉపయోగపడుతున్నాడు. అతను కెప్టెన్ మాత్రమే కాదు, ముందుండి నడిపించే నిజమైన లీడర్ కూడా...
undefined
ఇయాన్ మోర్గాన్ ఎలా ఆడతాడదానిపైనే టీ20 సిరీస్ ఫలితం ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నా... అతను బ్యాట్‌తో రాణిస్తే, ఇంగ్లాండ్ జట్టు మంచి సిరీస్ ఆడుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్...
undefined
టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్న డేవిడ్ మలాన్‌పై కూడా భారీ అంచనాలున్నాయి. ‘డేవిడ్ మలాన్‌ మొదటిసారిగా ఇండియాలో మ్యాచ్ ఆడబోతున్నాడు. అతనిపై భారీ అంచనాలుంటాయి. కానీ స్పిన్ బౌలింగ్‌లో అతను చక్కగా బ్యాటింగ్ చేయగలడు...
undefined
ఆఫ్ సైడ్‌ కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగల మలాన్‌కి టీమిండియా గ్రౌండ్స్ చక్కగా సరిపోతాయి... రెండేళ్లుగా అద్భుతమైన క్రికెట్ ఆడుతున్న మలాన్, ఇంగ్లాండ్ సిరీస్‌లో కీలకం అవుతాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు గ్రేమ్ స్వాన్...
undefined
‘జో రూట్ కాస్త నెమ్మదస్తుడు. తనకి కావాల్సిన ప్లేయర్లను గట్టిగా కావాలని కూడా పట్టుబట్టలేడు. ఇంగ్లాండ్ బోర్డు ఎవరిని ఆడించమంటే వాళ్లని ఆడించాడు. కానీ మోర్గాన్ అలా కాదు...
undefined
ఇయాన్ మోర్గాన్ తనకి కావాల్సిన ప్లేయర్ల విషయంలో చాలా స్పష్టంగా ఉంటాడు. అందుకే అతను మంచి విజయాలు అందుకుంటున్నాడు... టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు అదరగొడుతుంది’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్.
undefined
click me!