ఆల్బి మోర్కెల్ తండ్రి కోసం బిజినెస్ క్లాస్ టికెట్స్... సీఎస్‌కే అంటే ప్లేయర్లుకు ఎందుకు అంత ఇష్టమో...

First Published Jan 30, 2023, 4:20 PM IST

ఐపీఎల్‌లో ఎన్ని ఫ్రాంఛైజీలు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ ఫాలోయింగ్ వేరు. ఒక్కసారైనా చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాలని అనుకుంటున్నారు క్రికెటర్లు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి మహేంద్ర సింగ్ ధోనీ. రెండోది సీఎస్‌కే ప్లేయర్లను చూసుకునే విధానం...

కేన్ విలియంసన్, యజ్వేంద్ర చాహాల్, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఇలా చాలామంది క్రికెటర్లు, చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఒక్క సీజన్ అయినా ఆడాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు...

సీఎస్‌కే నుంచి బయటికి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ కూడా తన కెరీర్‌ని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లోనే ముగించాలని ఉందని కామెంట్ చేశాడు. సీఎస్‌కే తరుపున ఆడాలని ప్లేయర్లు ఎందుకని ఇంతలా కోరుకుంటున్నారు... దీనికి సరైన సమాధానం ఇచ్చాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, సీఎస్‌కే మాజీ ఆల్‌రౌండర్ స్కాట్ స్టైరిస్...

Latest Videos


albie morkel in csk

‘సౌతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ ఆల్బీ మోర్కెల్, చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున ఐదు సీజన్లు ఆడాడు. 2008 నుంచి 2013 వరకూ సీఎస్‌కేలోనే ఉన్నాడు. 2011 సీజన్‌లో మోర్కెల్ తండ్రి, కొడుకు ఆటను చూసేందుకు ఇండియాకి రావాలని అనుకున్నాడు..

అయితే ఆయన ఇంతవరకూ ఎప్పుడూ ఇండియాకి వచ్చింది లేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, ఆయన్ని బిజినెస్ క్లాస్‌లో ఇండియాకి తీసుకొని వచ్చింది. ప్లేయర్ల కుటుంబాలను తీసుకురావాల్సిన అవసరం ఫ్రాంఛైజీకి లేదు...

ఐపీఎల్ కాంట్రాక్ట్‌లో ఇలాంటివి ఉండవు కూడా. అయితే మోర్కెల్‌ని తమ కుటుంబసభ్యుడిగా భావించిన సీఎస్‌కే టీమ్ మేనేజ్‌మెంట్, ఆయన తండ్రి కోసం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇది చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయర్లకు ఇచ్చే విలువ...’ అంటూ చెప్పుకొచ్చాడు స్కాట్ స్టైరిస్...
 

click me!