Jasprit Bumrah: ఆదరాబాదరగా తీసుకొచ్చె.. అసలుకే మోసం తెచ్చె.. బుమ్రా విషయంలో వేళ్లన్నీ బీసీసీఐ వైపే..

Published : Sep 30, 2022, 11:41 AM ISTUpdated : Sep 30, 2022, 11:54 AM IST

T20I World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో ఎలాగైనా ఆడించాలనే తాపత్రయంతో  గాయంతో బాధపడుతున్న  ఆటగాడిని ఆదరాబాదరగా తీసుకొచ్చినందుకు బీసీసీఐ తగిన మూల్యం చెల్లించుకుంటున్నది.   

PREV
17
Jasprit Bumrah: ఆదరాబాదరగా తీసుకొచ్చె.. అసలుకే మోసం తెచ్చె.. బుమ్రా విషయంలో  వేళ్లన్నీ బీసీసీఐ వైపే..

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా  వెన్నునొప్పి తిరిగబెట్టడంతో స్వదేశంలో జరుగుతున్న సౌతాఫ్రికా సిరీస్ తో పాటు వచ్చేనెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ కు కూడా దూరమయ్యాడు. అయితే బుమ్రా  విషయంలో తప్పంతా బీసీసీఐ, సెలక్టర్లదే అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  గాయపడ్డ ఆటగాడిని పూర్తిగా కోలుకోనీయకుండా  చేసి ఆడించినందుకు  ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నదని విమర్శిస్తున్నారు.

27

ఈ ఏడాది జులైలో ఇంగ్లాండ్ తో  రీషెడ్యూల్డ్ టెస్టుతో పాటు  వన్డేలలో ఆడిన బుమ్రా తర్వాత విశ్రాంతి తీసుకున్నాడు.  భారత జట్టు అనంతరం ఆడిన వెస్టిండీస్,  జింబాబ్వే సిరీస్ లకు కూడా అతడు అందుబాటులో లేడు. ఆసియా కప్ కు ముందు  బీసీసీఐ స్పందిస్తూ.. వెన్నునొప్పి కారణంగా బుమ్రా ఈ టోర్నీలో ఆడటం లేదని.. అతడికి కనీసం రెండు, మూడు నెలలైనా విశ్రాంతి కావాలని  చెప్పింది.  అయితే ఆసియా కప్ కు దూరమైన అతడిని  విశ్రాంతి తీసుకోనీయకుండా  ప్రపంచకప్ లో ఆడించాలని సెలక్టర్లు భావించారు.

37

ఇందులో భాగంగానే  ఈ నెల ప్రపంచకప్ జట్టును ప్రకటించడానికి రెండ్రోజుల ముందు బెంగళూరులో ఉన్న  జాతీయ క్రికటె అకాడమీ  (ఎన్సీఏ) లో హడావిడిగా ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించింది. బుమ్రాతో పాటు హర్షల్ కు కూడా ఫిట్నెస్ టెస్టు  చేసింది.  ఆ టెస్టులో ఫలితాలు ఏం వచ్చాయో గానీ.. ఇద్దరూ ఫిట్నెస్ సాధించారని ఇద్దరినీ టీ20 ప్రపంచకప్ జట్టుతో  పాటు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ లకు ఎంపిక చేసింది.

47
Image credit: Getty

అయితే ఆసీస్ తో సిరీస్ లో  తొలి మ్యాచ్ లో బుమ్రాను ఆడించలేదు. తర్వాత రెండు మ్యాచ్ లలో ఆడించినా అతడు పెద్దగా ఆకట్టుకోలేదు. దక్షిణాఫ్రికాతో సిరీస్ లో  తొలి మ్యాచ్ కు ముందు మళ్లీ తనకు వెన్నునొప్పిగా ఉందని బుమ్రా చెప్పడంతో అతడిని హుటాహుటిన బెంగళూరులోని ఎన్సీఏ కు తరలించారు. ఇక గురువారం రాత్రి బీసీసీఐ.. మరోసారి చావు కబురు చల్లగా అందించింది.

57
Jasprit Bumrah

ఈ ఎపిసోడ్ మొత్తం గమనిస్తే ప్రపంచకప్ కోసమే బుమ్రా ఫిట్ గా లేకున్నా.. అతడింకా ఫిట్నెస్ సాధించకున్నా బీసీసీఐ అతడిని హడావిడిగా  తీసుకొచ్చిందని అర్థమవుతూనే ఉన్నది.  ప్రపంచకప్ కు ముందు కొన్ని మ్యాచ్ లు ఆడించి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు పంపించాలని  మాస్టర్ ప్లాన్ వేసింది. భువనేశ్వర్ విఫలమవుతుండటం, హర్షల్ తిరిగి పాత ఫామ్ ను అందుకోకపోవడంతో బీసీసీఐకి  గత్యంతరం లేక బుమ్రాను తీసుకొచ్చిందనే వాదనలూ వినిపిస్తున్నాయి.

67

ప్రపంచకప్ కు ముందే ఆసియా కప్ సందర్బంగా  బుమ్రాకు రెండు నుంచి మూడు నెలలు విశ్రాంతి కావాలని చెప్పిన బీసీసీఐ.. మళ్లీ అతడు త్వరగా కోలుకున్నాడని చెప్పినప్పుడే అందరికీ అనుమానం వచ్చింది. ఆసీస్ తో తొలి టీ20లో బుమ్రాను ఆడించనప్పుడు ఆ అనుమానం నిజమైంది.

77

అయితే బుమ్రాను ప్రపంచకప్ కు ఎంపిక చేసినా అతడిని ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ లకు ఎంపిక చేయకుండా ఉన్నా అప్పటివరకు అతడు ఎంతో కొంత  కోలుకునేవాడు.   జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి అక్టోబర్ 15 వరకు ఛాన్స్ ఉండటంతో  ప్రపంచకప్ ముందువరకు బుమ్రా ఫిట్  గా ఉన్నాడా..? లేదా..? అనేది లెక్కలేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ కాస్త అవకాశం కూడా లేకుండా చేయడంలో బీసీసీఐ పాత్ర సుస్పష్టమనేది విశ్లేషకుల అభిప్రాయం.
 

click me!

Recommended Stories