మొన్న న్యూమోనియా.. నిన్న కోవిడ్.. పాక్ యువ పేసర్‌కు కష్టాలు.. ప్రపంచకప్‌లో ఆడతాడా..?

Published : Sep 30, 2022, 10:55 AM IST

PAK vs ENG T20I: పొట్టి ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న క్రికెట్ జట్లకు గాయాల బెడద వేధిస్తుంటే మరోపక్క ఆటగాళ్ల ఆరోగ్యం కూడా ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే నిఖార్సైన పేసర్ సేవలను కోల్పోయిన పాకిస్తాన్ తాజాగా.. 

PREV
17
మొన్న న్యూమోనియా.. నిన్న కోవిడ్.. పాక్ యువ పేసర్‌కు కష్టాలు.. ప్రపంచకప్‌లో ఆడతాడా..?

పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రధాన బలం బౌలింగ్.  ప్రపంచవ్యాప్తంగా ఏ పిచ్ లో అయినా స్వింగ్ రాబట్టగల బౌలర్లు ఆ జట్టులో పుష్కలంగా ఉన్నారు. కానీ  రాబోయే ప్రపంచకప్ కు ముందు ఆ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఆసియా కప్  కు ముందు గాయపడ్డ  స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది  ప్రస్తుతం  ఇంగ్లాండ్ లో చికిత్స పొందుతున్నాడు. 

27

మోకాలి గాయం కారణంగా  చికిత్స తీసుకుంటున్న అతడు  ప్రపంచకప్  వరకు  పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తాడని చెబుతున్నా  దానిపై స్పష్టత లేదు.  దీంతో అతడు పాకిస్తాన్ కు మరో బుమ్రా ( గాయంతో వైదొలగడం) అవుతాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. 

37

ఇదిలాఉండగా ఇటీవలే ఆసియాకప్ ద్వారా వెలుగులోకి వచ్చి టీ20 ప్రపంచకప్ లో స్థానం దక్కించుకున్న  యువ పేసర్ నసీమ్ షా కూడా ఇప్పుడు ఈ మెగా టోర్నీలో ఆడతాడా..? లేదా..? అనేది అనుమానంగానే ఉంది.  

47

ఇంగ్లాండ్ తో సిరీస్ కు ఎంపికై తొలి టీ20 ఆడిన షా..  తొలి మ్యాచ్ లో విఫలం కావడంతో  అతడికి  జట్టులో చోటు దక్కలేదు. కానీ ఐదో టీ20కి ముందు  ఛాతిలో నొప్పి  రావడంతో అతడిని హుటాహుటిన లాహోర్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

57

మరుసటి రోజు  షా కు న్యూమోనియా సోకిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది.  అయితే   అతడు బాగానే ఉన్నాడని   మరో ప్రకటనలో చెప్పిన పీసీబీ.. గురువారం పాక్ అభిమానులకు మరో షాకచ్చింది.   నసీమ్ షా కరోనా బారిన పడ్డాడని గురువారం సాయంత్రం మరో ప్రకటనలో వెల్లడించింది. 

67

దీంతో అసలు నసీమ్ ఆరోగ్యంగా ఉన్నాడా..? లేదా..? ఉంటే పీసీబీ ఇలా రోజుకో కారణమెందుకు  చెబుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సోకడంతో నసీమ్ షా.. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో ఆడుతున్న మిగిలిన రెండు టీ20లకు దూరమయ్యాడు.

77

ఈ రెండు టీ20లే గాక  పాకిస్తాన్..  స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ ముగిశాక న్యూజిలాండ్ కు వెళ్లనుంది. అక్కడ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తో కలిసి ముక్కోణపు టీ20 సిరీస్ ఆడనుంది.   ప్రస్తుత పరిస్థితుల్లో నసీమ్.. కివీస్ పర్యటనకు వెళ్లేది అనుమానమే. అయితే అతడు ఒక్క కివీస్ పర్యటనకేనా..? లేక టీ20 ప్రపంచకప్ కు కూడా దూరమవుతాడా..? అనేదానిపై  పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 

click me!

Recommended Stories