ఇంగ్లాండ్ టెస్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్... కొత్త కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌తో...

First Published May 12, 2022, 6:59 PM IST

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని ఇంగ్లాండ్ టెస్టు హెడ్ కోచ్‌గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు... వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో హెడ్ కోచ్‌గా...

వరుస వైఫల్యాలతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో అట్టడుగున నిల్చిన ఇంగ్లాండ్, జట్టులో సమూల మార్పులకు అడుగులు వేస్తోంది. సౌమ్యులుగా గుర్తింపు పొందిన వారిని పక్కనబెట్టి, దూకుడు మంత్రం జపించే హిట్టర్లను వెతికి మరీ పట్టుకొస్తోంది...

యాషెస్ సిరీస్ 2021-22 సిరీస్‌లో 4-0 తేడాతో ఘోర పరాజయం చవి చూసింది ఇంగ్లాండ్ జట్టు. ఈ ఓటమి తర్వాత హెడ్ కోచ్‌ క్రిస్ సిల్వర్‌వుడ్‌పై వేటు వేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు...
 

Joe Root

అయితే ఆ తర్వాత వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఓడింది ఇంగ్లాండ్. దీంతో వరుస ఓటములకు బాధ్యత వహించి జో రూట్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌ని టెస్టు సారథిగా నియమించింది... 

ఎన్నో ఏళ్లుగా వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్లకు ఇద్దరు కెప్టెన్ల ఫార్ములాను అనుసరిస్తూ వస్తున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, ఇప్పుడు హెడ్ కోచ్‌లను కూడా ఫార్మాట్‌కి తగ్గట్టుగా నియమించాలని నిర్ణయం తీసుకుంది...
 

తాజాగా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, మాజీ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్‌ని టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా నియమించింది ఇంగ్లాండ్. న్యూజిలాండ్‌లో పుట్టిన మెక్‌కల్లమ్, వచ్చే నెలలో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ ద్వారానే ఇంగ్లాండ్ హెడ్ కోచ్‌గా కెరీర్ మొదలెట్టబోతున్నాడు...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న మెక్‌కల్లమ్, ఇంతకుముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ కోచ్‌గా వ్యవహరించాడు...

ప్లేయర్‌గా 101 టెస్టులు ఆడిన బ్రెండన్ మెక్‌కల్లమ్, 12 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 6453 పరుగులు చేశాడు. 260 వన్డేలు, 71 టీ20 మ్యాచులు ఆడిన 8 వేలకు పైగా పరుగులు చేశాడు...

click me!