టెండూల్కర్‌ని అవుట్ చేసేందుకు రికీ పాంటింగ్, గిల్‌క్రిస్ట్ కలిసి ప్లాన్ వేశారు... అయితే ‘మాస్టర్’ మాత్రం...

First Published Jul 16, 2021, 11:58 AM IST

రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్‌లో కొనసాగిన ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థి జట్టు గుండెల్లో గుబులు రేగేది. సచిన్ అవుటైతే మ్యాచ్ గెలిచినట్టే అనే ఫీలింగ్, ప్రత్యర్థి జట్టులో ఉండేది...

వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ ఎంట్రీకి ముందైతే సచిన్ టెండూల్కర్ ప్రభావం జట్టుపై మరింత తీవ్రంగా ఉండేది. సచిన్ టెండూల్కర్ అవుటైతే మ్యాచ్ పోయినట్టే అని, జట్టులోని మిగిలిన ప్లేయర్లు కూడా ఫిక్స్ అయిపోయేవాళ్లు...
undefined
2007లో సచిన్ టెండూల్కర్‌ను అవుట్ చేసేందుకు అప్పటి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్, వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ కలిసి వేసిన ఓ ప్లాన్‌ను తాజాగా బయటపెట్టాడు ఆసీస్ మాజీ బౌలర్ బ్రాడ్ హాగ్...
undefined
‘టీమిండియాతో మ్యాచ్ ఆడుతున్నాం. ఓ వైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు సచిన్ టెండూల్కర్ అవుట్ కాకుండా సెటిలైపోయాడు. దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నాడు...
undefined
అప్పుడు గిల్‌క్రిస్ట్, రికీ పాంటింగ్ కలిసి నా దగ్గరికి వచ్చి... ‘రాంగ్ బాల్స్’ వేయమని కోరారు. లెగ్ స్టంప్‌ను టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేయమని, అక్కడ అతని ఫుట్‌వర్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా అవుట్ అవుతాడని చెప్పారు...
undefined
అయితే వాళ్లు చెప్పింది నాకు కరెక్ట్ అనిపించలేదు. రాంగ్ బాల్స్ వేసిన ప్రతీసారి, సచిన్ టెండూల్కర్ ఫుట్‌వర్క్ అవసరం లేకుండా బౌండరీలు బాదడం మొదలెట్టాడు. అందుకే నేను అలా చేయనని చెప్పేశా...
undefined
నేను కాళ్లను టార్గెట్ చేస్తూ బాల్స్ వేస్తాను. ప్రతీ బాల్ రాంగ్ వన్స్ వేయాలంటే చాలా కష్టం. కాబట్టి కొద్దిగా వేగం పెంచి, పరుగులు ఇవ్వకుండా నియంత్రిస్తా. అప్పుడు రన్‌రేట్ తగ్గితే, అతను వికెట్ ఇస్తాడని చెప్పా...
undefined
నేను అనుకున్నట్టుగానే ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ ఓ భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అయితే నా కెరీర్‌లో సచిన్ వికెట్ తీయడం అదే మొదటిసారి, చివరిసారి కూడా...
undefined
ఆ మ్యాచ్‌లో టెండూల్కర్ వికెట్ తీసిన తర్వాత అదే బంతిపై ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నా. ‘మళ్లీ ఇలా జరగదని’ మాస్టర్ నాతో చెప్పాడు. చెప్పినట్టుగానే నా బౌలింగ్‌లో అతను అవుట్ కాలేదు...
undefined
ప్రత్యర్థి బలాన్ని, తన బలహీనతను అర్థం చేసుకుని... దాన్ని రిపీట్ కాకుండా ఆడగలిగే ప్లేయర్లే గొప్ప క్రికెట్ అవుతాడు. మాస్టర్‌కీ, మిగిలిన ప్లేయర్లకీ ఉన్న తేడా అదే’ అంటూ చెప్పుకొచ్చాడు బ్రాడ్ హాగ్...
undefined
ఆస్ట్రేలియా తరుపున 7 టెస్టులు, 124 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన స్పిన్నర్ బ్రాడ్ హాగ్ మొత్తంగా 181 వికెట్లు పడగొట్టాడు...
undefined
click me!