అతని బ్యాటర్ మాత్రమే కాదు, కెప్టెన్ కూడా... మెగా వేలంలో ఫాఫ్ డుప్లిసిస్ హాట్ కేక్ అవుతాడా...

Published : Feb 04, 2022, 01:01 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి మరో వారం మాత్రమే ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా మెగా వేలం జరగనుంది. అయితే ఈ వేలంలో హాట్ కేక్‌లా మారే ప్లేయర్ ఎవరు?

PREV
114
అతని బ్యాటర్ మాత్రమే కాదు, కెప్టెన్ కూడా... మెగా వేలంలో ఫాఫ్ డుప్లిసిస్ హాట్ కేక్ అవుతాడా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు పంజాబ్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ వంటి జట్లు కెప్టెన్ కోసం చూస్తున్నాయి...

214

డేవిడ్ వార్నర్‌తో పాటు శ్రేయాస్ అయ్యర్, ఇయాన్ మోర్గాన్ వంటి ఐపీఎల్ మాజీ కెప్టెన్లు కూడా ఈసారి మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...

314

ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో కోల్‌కత్తా నైట్‌రైడర్స్, గత సీజన్‌లో ఫైనల్ చేరినా... బ్యాటర్‌గా మాత్రం అతను అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...

414

కాబట్టి ఇయాన్ మోర్గాన్‌ని ఈసారి ఏ జట్టు అయినా కొనుగోలు చేయడానికి ఇష్టపడుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి...

514

శ్రేయాస్ అయ్యర్, డేవిడ్ వార్నర్‌ల కోసం తీవ్రమైన పోటీ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ లిస్టులో సీఎస్‌కే మాజీ ప్లేయర్, సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లిసిస్ కూడా ఉంటాడని అంటున్నాడు మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్...

614

ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొదట వేలానికి వచ్చే మర్క్యూ సెట్‌లో రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, ప్యాట్ కమ్మిన్స్, శ్రేయాస్ అయ్యర్, క్వింటన్ డి కాక్ వంటి ప్లేయర్లతో పాటు ఉన్నాడు ఫాఫ్ డుప్లిసిస్...

714

ఐపీఎల్ 2021 సీజన్‌లో 633 పరుగులు చేసిన ఫాఫ్ డుప్లిసిస్, రెండు పరుగుల తేడాతో ఆరెంజ్ క్యాప్‌ను మిస్ అయ్యాడు. డుప్లిసిస్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన రుతురాజ్ గైక్వాడ్ 635 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన విషయం తెలిసిందే...

814

అంతకుముందు 2020 సీజన్‌లోనూ సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన డుప్లిసిస్ కోసం చెన్నైతో పాటు ఆర్‌సీబీ, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ పోటీపడతాయని అంటున్నాడు బ్రాడ్ హాగ్...

914

‘ఐపీఎల్ మెగా వేలంలో ఫాఫ్ డుప్లిసిస్ ఎంత ధర దక్కించుకుంటాడో చూడాలి. ఎందుకంటే అతను సూపర్ బ్యాటర్ మాత్రమే కాదు, అద్భుతమైన లీడర్‌షిప్ స్కిల్స్ ఉన్న కెప్టెన్, మంచి ఫీల్డర్ కూడా...

1014

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సీఎస్‌కే, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ వంటి టీమ్స్ అతని కోసం తప్పకుండా ప్రయత్నిస్తాయి....

1114

టాపార్డర్‌లో దూకుడుగా ఆడే ఫాఫ్ డుప్లిసిస్, నా అంచనా ప్రకారం 7 నుంచి రూ.11 కోట్ల వరకూ ఈజీగా దక్కించుకుంటాడు...

1214

శ్రేయాస్ అయ్యర్ చాలా నిలకడగా ఆడుతున్నాడు. అతను ఐపీఎల్‌లో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ కూడా. కాబట్టి అయ్యర్ కూడా మెగా వేలంలో హాట్ కేక్...

1314

డెత్ ఓవర్లలో బంతిని అద్భుతంగా కంట్రోల్ చేయగలగడం కగిసో రబాడా స్పెషాలిటీ. కాబట్టి అతనికి కూడా మంచి ధర దక్కడం ఖాయం...

1414

మహ్మద్ షమీని కొనుగోలు చేయడానికి అన్ని జట్లూ తప్పకుండా పోటీపడతాయి. నా అంచనా అతనికి ఈసారి కచ్చితంగా రూ.5 కోట్లకు పైగా ధర దక్కడం ఖాయం...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్..

click me!

Recommended Stories