ఆసియా కప్‌ పోయిందిగా! మళ్లీ కెప్టెన్‌ని మారుస్తారా మాస్టారూ... బీసీసీఐని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

First Published Sep 7, 2022, 4:00 PM IST

ఆసియా కప్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్‌గా అడుగుపెట్టింది భారత జట్టు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలుస్తూ వస్తున్న టీమిండియాని ఓడించగల సత్తా, మిగిలిన ఏ టీమ్‌లకూ లేదని అనుకున్నారంతా. అయితే అన్యూహ్యంగా సూపర్ 4 రౌండ్‌లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి దాదాపు ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది భారత జట్టు. దీంతో బీసీసీఐపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

2021 టీ20 వరల్డ్ కప్ ఓడిన తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. అయితే బీసీసీఐ మాత్రం అతన్ని బలవంతంగా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. కొన్నిరోజులకే కేప్‌టౌన్ టెస్టు ఓటమి తర్వాత టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ...

rohit sharma

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ కారణంగానే భారత జట్టు ఐసీసీ టైటిల్ గెలవలేకపోతుందని ట్రోల్స్ వినిపించాయి. అందులోనూ ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన రోహిత్ శర్మని జట్టులో పెట్టుకుని, ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించడంపై ట్రోల్స్ వచ్చాయి...

బీసీసీఐ కూడా ముంబై ఇండియన్స్‌కి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మ కెప్టెన్సీని మెచ్చిన బీసీసీఐ, అతనికి కెప్టెన్సీ ఇవ్వడమే సబబని భావించింది. అయితే ద్వైపాక్షిక సిరీసుల్లో దుమ్మురేపిన భారత జట్టు, ఆసియా కప్ టోర్నీలో తేలిపోయింది...

rohit sharma

దీంతో ఇంకోసారి కెప్టెన్‌ని మార్చేందుకు బీసీసీఐ ప్లాన్ చేసుకుంటే బెటర్ అని... ఈసారి ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని ట్రోల్స్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు టీమిండియా అభిమానులు...

హార్ధిక్ పాండ్యాకి కాకపోతే బీసీసీఐకి అత్యంత ప్రీతిపాత్రుడైన కెఎల్ రాహుల్‌కి భారత జట్టును నడిపించే బాధ్యతలను కట్టబెట్టి, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి పంపించాలని వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు..

విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఏడాదిలో 8 మంది కెప్టెన్లను మార్చింది బీసీసీఐ. ఆటగాళ్ల ఫిట్‌నెస్ లోపాలు, రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో సిరీస్‌కో కెప్టెన్‌ని వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఫిట్‌గా ప్రతీ సిరీస్‌కి అందుబాటులో ఉండే ఒక్క సరైన కెప్టెన్‌ని ఎంచుకోలేకపోయారా? అంటూ భారత క్రికెట్ బోర్డుపై విమర్శల వర్షం కురుస్తోంది...

ఇంతకుముందు భారత జట్టు ఏ మ్యాచ్ ఓడినా, ఓ సిరీస్ ఓడినా విరాట్ కోహ్లీ కెప్టెన్సీని ట్రోల్ చేస్తూ... రోహిత్‌కి కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేసే బ్యాచ్... ఇప్పుడు రోహిత్ సేన కూడా అచ్చు విరాట్ టీమ్ ఓడినట్టే ఓడడంతో సమస్య కెప్టెన్సీలో లేదని, ఆటగాళ్ల మైండ్‌సెట్‌లో, టీమ్ మేనేజ్‌మెంట్ రాజకీయాల్లో ఉందనే విషయాన్ని అర్థం చేసుకుంది...

Rohit Sharma and KL Rahul

అయినా తప్పు రోహిత్ శర్మలో కూడా లేదు. ఆసియా కప్ 2018 టోర్నీలో టైటిల్ గెలిచాడు రోహిత్ శర్మ. అయితే అప్పుడు టీమ్‌లో ఎంఎస్ ధోనీ ఉన్నాడు. జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శిఖర్ ధావన్ వంటి సీనియర్లు అండగా ఉన్నారు. కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌ ప్రతీ మ్యాచ్‌కీ మారలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ, ఐపీఎల్ ఫార్ములాని వాడబోయి బొక్కబోర్లా పడ్డాడని అంటున్నారు మరికొందరు...

click me!