Shahid Kapoor: టీమిండియాలో వాళ్లిద్దరే నాకు స్పూర్తి.. జెర్సీ హీరో షాహిద్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published : Dec 28, 2021, 02:25 PM IST

Jersey Movie: బాలీవుడ్ అర్జున్ రెడ్డి  షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న మరో తెలుగు రిమేక్ జెర్సీ... ఈ సినిమా ప్రమోషన్స్ లో  అతడు టీమిండియా మాజీ సారథుల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 

PREV
17
Shahid Kapoor: టీమిండియాలో వాళ్లిద్దరే నాకు స్పూర్తి.. జెర్సీ హీరో షాహిద్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బాలీవుడ్ స్టార్ షాహిద్  కపూర్ హీరోగా నటించిన జెర్సీ చిత్రం ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా అతడు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

27

టీమిండియాలో తనకు మాజీ సారథి ఎంఎస్ ధోని, ప్రస్తుత టెస్టు సారథి విరాట్ కోహ్లిలు స్పూర్తిగా నిలిచారని షాహిద్ కపూర్ అన్నాడు. కోహ్లి  ఇంకా టీమిండియాలో ఆడుతుండగా ధోని మాత్రం గతేడాది ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

37

జెర్సీ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ షో లో  షాహిద్ మాట్లాడుతూ.. ‘ఒక  బ్యాటర్ గా ఇతర బ్యాటర్ల నుంచి స్పూర్తి పొందటంలో అర్థం లేదు. ఎందుకంటే  మీరు ప్రొఫెషనల్ క్రికెటర్లతో పాటు ఎప్పటికీ ఆడలేరు. కానీ కొంత మంది వ్యక్తుల ఉనికి, వాళ్ల వ్యక్తిత్వం నుంచి మనం ఎంతో కొంత స్పూర్తి పొందుతాం. 

47

నా వరకైతే  ఆ జాబితాలో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లిలు తప్పకుండా ఉంటారని నేను భావిస్తున్నాను. వాళ్లు బ్యాటింగ్ చేయడానికి క్రీజులోకి అడుగుపెట్టగానే ఏదో ఒక  మ్యాజిక్ జరుగుతుంది.

57

వాళ్లను కేవలం క్రికెటర్లుగా మాత్రమే కాకుండా క్రీడల పట్ల వారికున్న అభిరుచి కారణంగా నేను వాళ్లకు  పెద్ద ఫ్యాన్ గా మారాను. వాళ్లు మైదానంలో ఉన్న ప్రతి నిమిషాన్ని నేను ఎంజాయ్ చేస్తాను..’ అని చెప్పాడు. 

67

ఇక  బాలీవుడ్ లో తెరకెక్కిన జెర్సీ సినిమా తెలుగులో వచ్చిన జెర్సీ కి రిమేక్. తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డులతో పాటు రివార్డులు కూడా భాగానే వచ్చాయి. 

77

ఈ సినిమా మీద మనసు పారేసుకున్న షాహిద్ కపూర్.. బాలీవుడ్ లో ఈ సినిమాలో హీరోగా చేయడానికి ఒప్పుకున్నాడు. అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో మృనాల్ ఠాకూర్, పంకజ్ కపూర్, గీతిక మెహ్రందు ఇతర తారాగణం. 

Read more Photos on
click me!

Recommended Stories