విరాట్ కోహ్లీకి టాటూలు, పార్టీలు అంటే పిచ్చి, కానీ ఇప్పుడేమో సుద్ధ పూసలా... - ఇషాంత్ శర్మ

Published : Jun 26, 2023, 12:02 PM IST

ఇషాంత్ శర్మ, విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుంచి టీమ్‌మేట్స్. ఢిల్లీ తరుపున దేశవాళీ టోర్నీలు ఆడిన ఈ ఇద్దరూ, టెస్టుల్లోనూ ఎన్నో మ్యాచులు కలిసి ఆడారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే ఆఖరి టెస్టు ఆడిన ఇషాంత్ శర్మ, టీమిండియా మాజీ కెప్టెన్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు...

PREV
17
విరాట్ కోహ్లీకి టాటూలు, పార్టీలు అంటే పిచ్చి, కానీ ఇప్పుడేమో సుద్ధ పూసలా... - ఇషాంత్ శర్మ
Ishant Sharma - Virat Kohli

‘విరాట్ కోహ్లీని అండర్17 నుంచి చూస్తున్నా. అప్పటికీ, ఇప్పటికీ అతనిలో చాలా మార్పు వచ్చింది. కెరీర్ ఆరంభంలో పార్టీలు, టాటూలు అంటే పడిచచ్చేవాడు. ఇప్పుడేమో అన్నీ మానేసి సుద్ధపూసలా మారిపోయాడు..

27

కోల్‌కత్తాలో అండర్19 మ్యాచ్ ఆడుతున్నాం. ఆ రోజు అతను రాత్రి అంతా బ్యాటింగ్ చేశాడు. తెల్లారేదాకా పార్టీలో డ్యాన్స్ చేశాడు... ఆ తర్వాతి రోజు 250 పరుగుల స్కోరు బాదాడు. విరాట్ కోహ్లీ ఆ టైమ్‌లో చాలా క్రేజీగా ఉండేవాడు..

37

కెరీర్ మొదట్లో పిజ్జాలు, చికెన్‌లు, బిర్యానీలు అలా అడ్డమైన గడ్డి మొత్తం తినేవాడు. ఫుడ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. 2012లో ఫిజికల్ ఫిట్‌నెస్ మీద ఫోకస్ పెట్టాడు...

47

వరల్డ్ కప్‌ తర్వాత అతని ట్రైయినింగ్ పూర్తిగా మారిపోయింది. డైట్ మార్చేశాడు. ఇన్నేళ్ల పాటు ఒకే రకమైన ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడం అంత తేలికైన విషయం కాదు. విరాట్‌కి ఉన్న మొండి పట్టుదలే, అతన్ని ఇలా మార్చేసింది..
 

57

విరాట్ కోహ్లీ వల్లే టీమిండియాలో ఫిట్‌నెస్‌‌కి ప్రాధాన్యం పెరిగింది. నాతో పాటు చాలామంది ప్లేయర్లు, విరాట్‌ని ఆదర్శంగా తీసుకుని ఫిట్‌నెస్‌పైన ఫోకస్ పెట్టాం. అంతకుముందు టీమ్‌లో ఫిట్‌నెస్‌కి ఇంత ప్రాధాన్యం ఉండేది కాదు..

67

విరాట్‌ ఒక్కడే కాదు, ఢిల్లీలో ఉండేవాళ్లు భోజన ప్రియులు. బాగా తింటారు, కానీ టీమ్‌ కోసం, తనను తాను స్టార్ క్రికెటర్‌గా తీర్చుదిద్దుకోవడం కోసం ఇష్టాలను పక్కనపెట్టేశాడు...

77

2012 తర్వాత అతను తనకి ఇష్టమైన ఛోలే భటురే తినడం ఇప్పటిదాకా ఒకటో రెండు సార్లు మాత్రమే చూశాను. డైట్‌ విషయంలో అంత కఠినంగా ఉంటాడు. నేనైతే పన్నీర్ నాన్ లాగించేస్తా...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ.. 

Read more Photos on
click me!

Recommended Stories