నాలుగేండ్లకోసారి జరిగే ఐసీసీ వన్డే ప్రపంచకప్ తో పాటు రెండేండ్లకోమారు నిర్వహించే టీ20 వరల్డ్ కప్ లలో భారత జట్టు ఓడినప్పుడల్లా క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు విశ్లేషకులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీద దుమ్మెత్తిపోస్తారు. ఈ లీగ్ వల్లే టీమిండియా ఆటగాళ్లు ఆటను మరిచిపోతున్నారని, ఐపీఎల్ ఇండియన్ క్రికెట్ ను నాశనం చేస్తుందని వాపోతారు.