చిక్కుల్లో చెన్నై సూపర్ కింగ్స్... మరోసారి ధోనీ టీమ్‌పై బ్యాన్ పడనుందా?...

First Published Jun 4, 2021, 4:54 PM IST

గత సీజన్‌లో దారుణమైన పర్ఫామెన్స్ నుంచి తేరుకుని, 2021 సీజన్‌లో టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చిక్కుల్లో పడింది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రూపా గురునాథ్ ఆమోదించిన ఓ ఆర్డర్‌‌లో జరిగిన అవకతవకలు నిరూపితం కావడమే దీనికి కారణం. 

బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జడ్జి డీకే జైన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ కూతురు, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన రూపా గురునాథ్ అవినీతికి పాల్పడినట్టు తేల్చారు. ఆమెపై ‘ప్రయోజన వివాదం’ ఆర్డర్ పాస్ చేశారు.
undefined
బీసీసీఐ అనుబంధ సంస్థ అయిన టీఎన్‌సీఏకి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు క్రియేట్ చేసిన రూపా, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్ (ఐసీఎల్)‌కి పూర్తిస్థాయి డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోంది.
undefined
చెన్నై సూపర్ కింగ్స్‌కి స్పాన్సర్‌గా వ్యవహారిస్తున్న సంస్థల్లో ఐసీఎల్‌ కూడా ఒకటి.న్నై సూపర్ కింగ్స్ లిమిటెడ్‌కి ఐసీఎల్‌కి అసోసియేషన్ పార్టనర్‌షిప్ రావడానికి రూపా పావులు కదిపినట్టు తేల్చారు. ఐసీఎల్‌ గొడుగు కింద ఉన్న సంస్థల్లో సీఎస్‌కే కూడా ఒకటని, ఈ సంస్థనే ఐపీఎల్ ఫ్రాంఛైజీని నడుపుతోందని 13 పేజీల ఆర్డర్‌ను ఇష్యూ చేశారు.
undefined
ఇప్పటికీ 2015లో లోధా కమిటీ సూచనలతో చెన్నై సూపర్ కింగ్స్‌పై రెండేళ్ల నిషేధం పడింది. 2016, 17 సీజన్లలో నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, 2018లో కమ్‌బ్యాక్ ఇస్తూ టైటిల్ కైవసం చేసుకుంది.
undefined
మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌ (ఎంపీసీఏ)లో సభ్యుడిగా ఉన్న సంజీవ్ గుప్తా, ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు. ‘ఐసీఎల్ అనే గొడుగు కింద చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఓ భాగమేనని చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వీటి మేనేజ్‌మెంట్ కూడా ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఐసీఎల్ బోర్డు చేతుల్లోనే ఉన్నాయి.
undefined
అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ చూపించిన నామినేషన్స్‌లో కానీ లెక్కల్లో కానీ ఐసీఎల్‌కి ఎలాంటి వాటా లేదని చూపించారు. ఇది బీసీసీఐ నిబంధన 38(1)(i) ద్వంద్వ ప్రయోజన రూల్‌ను అధిగమించినట్టే అవుతుంది.
undefined
టీఎన్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఉన్న రూపా, తన బాధ్యతల నుంచి తప్పుకోమ్మని బీసీసీఐ కోరవచ్చు. లేదా ఐసీఎల్ డైరెక్టర్ బాధ్యతలకు ఆమె రాజీనామా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆర్డర్ జారీ చేసిన జైన్‌ కాంట్రాక్ట్ మరో నాలుగు రోజుల్లో (జూన్ 7)న ముగియబోతోంది.
undefined
ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంటే, మరోసారి చెన్నై సూపర్ కింగ్స్‌పై నిషేధం పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్ వాయిదాతో 2022లో కొత్త జట్లను చేర్చాలనే ఆలోచనపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోని బీసీసీఐ, సీఎస్‌కే నిషేధం విధించే సాహసం చేయకపోవచ్చు.
undefined
click me!