టీమిండియా సెలక్టర్లకు కొత్త కష్టం... ఇంత మంది రాణిస్తుంటే, ఎవరినని సెలక్ట్ చేయాలి...

First Published Mar 9, 2021, 9:59 AM IST

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా నిలకడగా ఉండేది. మొదటి వికెట్ నుంచి ఆఖరి వికెట్ దాకా ఎవరు వస్తారో, అందరికీ తెలిసేది. ఎప్పుడో కానీ జట్టులో మార్పు ఉండేది కాదు. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది. 

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టులోకి వచ్చే సభ్యులు, ఎక్కువకాలం ఉండేవారు కాదు. జట్టులోకి వచ్చేందుకు దేశవాళీ క్రికెట్‌లో చూపించిన ప్రదర్శన, టీమ్‌లోకి వచ్చాక చూపించకపోవడమే ఇందుకు కారణం...
undefined
దాంతో ధోనీకి ప్లేయర్లను మార్చేందుకు, తుది 11 మంది జట్టును ఎంచుకునేందుకు ఎలాంటి ఒత్తిడి, కష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది...
undefined
ముఖ్యంగా ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు సంచలన ప్రదర్శన ఇచ్చింది. ముఖ్యంగా బుమ్రా, అశ్విన్, జడేజా, కోహ్లీ, ఉమేశ్, షమీ, ఇషాంత్ లాంటి సీనియర్లు లేకపోయినా అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది...
undefined
తొలి టెస్టు ఆడిన వాషింగ్టన్ సుందర్, నటరాజన్, రెండో టెస్టు ఆడిన శార్దూల్ ఠాకూర్, మూడో టెస్టు ఆడిన సిరాజ్ అందరూ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు... దీంతో ఇప్పుడు టీమిండియాకి కొత్త తలనొప్పి వచ్చింది...
undefined
టెస్టు టీమ్‌లో ఉన్న రహానే, ఇషాంత్, పూజారాలు టీ20 జట్టులో ఆడడం లేదు. కానీ టీ20 సిరీస్‌కు ఎంపికైన ప్లేయర్లలో ఎవరిని ఆడించాలి? ఎవరిని రిజర్వుబెంచ్‌లో కూర్చొబెట్టాలనేది కొత్త తలనొప్పిగా మారింది...
undefined
భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా ఓపెనర్ ప్లేస్ కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇంతకుముందు అంటే రాహుల్ వికెట్ కీపర్‌గా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చేవాడు. కానీ వికెట్ కీపర్‌ రిషబ్ పంత్ మంచి ఫామ్‌లో ఉన్నాడు, అదీగాక యంగ్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను కూడా కీపర్‌గా ఎంపిక చేశారు.
undefined
దాంతో కెఎల్ రాహుల్ టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి రావాల్సి ఉంది. మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్‌కి వస్తాడు. నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్ లేదా సూర్యకుమార్ యాదవ్‌కి దింపాల్సి ఉంటుంది... ఎన్నడూ లేనట్టుగా నాలుగో స్థానంలో కోసం కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్ పోటీపడబోతున్నారు.
undefined
ఐదో స్థానంలో రిషబ్ పంత్, ఆరో స్థానంలో హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్‌కి రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా చేస్తే శిఖర్ ధావన్, లేదా కెఎల్ రాహుల్‌లలో ఒకరిని కూర్చోబెట్టాల్సి ఉంటుంది...
undefined
గాయంతో జట్టుకి దూరమైన భువనేశ్వర్ కుమార్, విజయ్ హాజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్‌, నటరాజన్ పేస్ బౌలర్ల ప్లేస్ కోసం పోటీపడుతున్నారు. ఈ నలుగురిలో ఇద్దరికే తుదిజట్టులో చోటు దక్కుతుంది.
undefined
అంతేకాకుండా స్పిన్ విభాగంలో యజ్వేంద్ర చాహాల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కూడా తుదిజట్టులో చోటు కోసం పోటీపడుతున్నారు. వీరితో పాటు ఇషాన్ కిషన్, రాహుల్ తెవాటియాలకు తుదిజట్టులో చోటు కల్పించాల్సి ఉంటుంది...
undefined
ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా గాయం నుంచి కోలుకున్నాక సీన్ ఎలా ఉంటుంది? టీ20 సిరీస్‌ నుంచి పెళ్లి కోసం రెస్టు తీసుకున్న బుమ్రాతో పాటు వచ్చే ఐపీఎల్ 2021 సీజన్‌లో కుర్రాళ్లు పర్ఫామెన్స్ అదరగొడితే సీన్ ఎలా మారుతుంది...అనేది సెలక్టర్లు తలలు పట్టుకుంటున్నారు.
undefined
click me!