కోహ్లీ, రోహిత్ శర్మలలో లేనిది పంత్‌లో ఉంది, వీరూ కనిపించాడు... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్...

First Published Mar 8, 2021, 7:54 PM IST

క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు ఆటతీరు వేరు. ఆసీస్ ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనే కసి కనిపిస్తుంది. ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టులో సరిగ్గా అదే కసి కనిపించింది. సీనియర్లు లేకుండా జూనియర్లు అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు. 

. సీనియర్లు లేకుండా జూనియర్లు అద్భుత ఆటతీరుతో అదరగొట్టారు. ఆసీస్ టూర్‌లో ఫామ్‌లోకి వచ్చిన భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు...
undefined
నాలుగో టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన రిషబ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా రిషబ్ పంత్‌ను మాజీ ఓపెనర్, వీరబాదుడు వీరేంద్ర సెహ్వాగ్‌తో పోల్చాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్...
undefined
‘రిషబ్ పంత్ చాలా టాలెంటెడ్ క్రికెటర్. ఎలాంటి పరిస్థితుల్లోనూ పంత్ ఫేస్‌లో ఒత్తిడి కనిపించదు. ఆస్ట్రేలియా టూర్‌లో, ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టులోనూ రిషబ్ పంత్ ఇన్నింగ్స్‌ను చాలా ఎంజాయ్ చేశాను...
undefined
6 కీలక వికెట్లు పడిన తర్వాత కూడా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా, ఎంతో ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు రిషబ్ పంత్... స్పిన్ బౌలింగ్ అయినా, పేస్ బౌలింగ్ అయినా ఏ మాత్రం తేడా లేకుండా షాట్లు బాదాడు...
undefined
పంత్ బ్యాటింగ్ చేస్తుంటే, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపించింది... అతను బ్యాటింగ్‌ను చాలా ఎంజాయ్ చేస్తాడు. వేరే విషయాలను అస్సలు పట్టించుకోడు...
undefined
పిచ్ ఎలా ఉన్నా, ఫీల్డర్లు ఎందరున్నా, బౌలర్ ఎవ్వరైనా సంబంధం లేకుండా షాట్లు ఆడతాడు... వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ స్టైల్ అచ్చు ఇలాగే ఉండేది...
undefined
టీమిండియాలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, గంగూలీ, యువరాజ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి చాలామంది క్రికెటర్లు టన్నుల్లో పరుగులు చేసి టాలెంటెడ్ ప్లేయర్లుగా నిరూపించుకున్నారు...
undefined
కానీ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం చాలా స్పెషల్. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తాడు. మళ్లీ అలాంటి కాన్ఫిడెన్స్ రిషబ్ పంత్‌లోనే కనిపిస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్.
undefined
click me!