అంబానీ వల్లే ముంబై మ్యాచ్ గెలిచిందా? కేకేఆర్ ఓడిన తీరుపై అనుమానాలు...

First Published Apr 14, 2021, 12:01 AM IST

ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన మ్యాచ్ చూసిన వారెవ్వరైనా... కేకేఆర్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అనిపించింది. క్రీజులో ఆండ్రూ రస్సెల్, దినేశ్ కార్తీక్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా, ఒక్క సిక్సర్ కొట్టలేక... సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ మ్యాచ్‌పై అనేక అనుమానాలు రేగుతున్నాయి...

డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లక్ష్యచేధనలో ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా రాణించడంతో 8.5 ఓవర్లలోనే 72 పరుగులు చేసింది కేకేఆర్...
undefined
విజయానికి ఇంకా 67 బంతుల్లో 80 పరుగులు కొడితే చాలు. ఎలాంటి బలహీనమైన జట్టు అయినా ఈ టార్గెట్‌ను ఈజీగా చేధించవచ్చు.
undefined
అయితే ఇయాన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్, రాహుల్ త్రిపాఠి, ఆండ్రూ రస్సెల్ వంటి టాప్ క్లాస్ హిట్టర్లు ఉన్న టీమ్... 10 పరుగుల తేడాతో ఓడుతుందని ఎవ్వరూ ఊహించలేదు...
undefined
ముఖ్యంగా 15వ ఓవర్ ఆఖరి బంతికి నితీశ్ రాణా అవుటయ్యే వరకూ కూడా ముంబై ఇండియన్స్ విజయంపై ఎవ్వరికీ ఆశలు లేవు. అయితే ఆ తర్వాతే భారీ హైడ్రామా నడిచింది...
undefined
షకీబ్ అల్ హసన్‌ను అవుట్ చేసిన కృనాల్ పాండ్యా, ఆ ఓవర్‌లో కేవలం ఒకే పరుగు ఇచ్చాడు. బుమ్రా వేసిన 17వ ఓవర్‌లో నో బాల్, ఫ్రీ హిట్ కారణంగా 8 పరుగులు వచ్చాయి...
undefined
ఇంకా విజయానికి 18 బంతుల్లో 22 కొడితే చాలు... ఐపీఎల్‌లో 3 ఓవర్లలో 50కి పైగా టార్గెట్ ఉంటేనే ఊదేస్తారు. అలాంటి 7 రన్‌రేటుతో పరుగులు చేయాలంటే రెండు ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందని అనిపించింది...
undefined
అయితే కృనాల్ పాండ్యా వేసిన 18వ ఓవర్‌లో 3, బుమ్రా వేసిన 19వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి... దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్ భారీ షాట్లకి ప్రయత్నించి, అవుట్ అయినా పెద్దగా అనుమానాలు రాకపోయేవి.
undefined
కానీ ఈ ఇద్దరు భారీ హిట్టర్లు కూడా సింగిల్స్ తీస్తూ, డాట్ బాల్స్ ఆడుతూ బంతులను వృథా చేయడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. కార్తీక్ కొడతాడని రస్సెల్, రస్సెల్ బాదుతాడని కార్తీక్ సింగిల్స్ తీసి ఉంటారని అనేవాళ్లు లేకపోలేదు...
undefined
కేకేఆర్ ఓటమిపై స్పందించిన షారుక్ ఖాన్... ‘జట్టు ఆటతీరు తీవ్రంగా నిరాశపరిచింది. కేకేఆర్ అభిమానులకు క్షమాపణలు చెబుతున్నా’ అంటూ ట్వీట్ చేశాడు...
undefined
చేజేతులా ఓడిన కేకేఆర్, కావాలనే ఇలా ఆడిందని... ముంబై రెండు మ్యాచుల్లో ఓడిపోతే పరువు పోతుందని ముకేశ్ అంబానీ వెనకుండి కథ నడిపించాడని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది...
undefined
అయితే టీ20 క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చు. పిచ్ భారీ షాట్లు ఆడేందుకు సహకరించడం లేదు. లేదంటే ముంబై ఇండియన్స్ లాంటి జట్టు 152 పరుగులకి ఆలౌట్ అవ్వడం ఏంటని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
కేకేఆర్ ఓటమికి కారణం ఏదైనా... ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన ఐదో మ్యాచ్ ముంబై ఫ్యాన్స్‌ను అలరించినా.... క్రికెట్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది.
undefined
click me!