ముంబై ఇండియన్స్ ఉత్కంఠ విజయం... ఈజీగా గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్...

First Published Apr 13, 2021, 11:35 PM IST

153 పరుగుల స్వల్ప లక్ష్యం... చేతిలో కావాల్సినన్ని వికెట్లు ఉన్నాయి. జట్టు నిండా హిట్టర్లు ఉన్నారు. అయినా డిఫెండింగ్ ఛాంపియన్‌ను స్వల్ప స్కోరుకే అవుట్ చేశాం, టార్గెట్‌ను ఈజీగా కొట్టేస్తామనే ధీమాతో ఆడినట్టు కనిపించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 18 బంతుల్లో 22 పరుగులు చేయలేక చేజేతులా ఓడింది...

153 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. శుబ్‌మన్ గిల్, నితీశ్ రాణా కలిసి తొలి వికెట్‌కి 72 పరుగుల భాగస్వామ్యం అందించారు...
undefined
24 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన శుబ్‌మన్‌గిల్‌ను అవుట్ చేసిన రాహుల్ చాహార్, ముంబైకి తొలి బ్రేక్ అందించారు. అయితే అప్పటికి కేకేఆర్ విజయానికి 67 బంతుల్లో 80 పరుగులు కావాలి... చేతిలో 9 వికెట్లు ఉన్నాయి.
undefined
అయితే గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్ త్రిపాఠి 5 పరుగులు, ఇయాన్ మోర్గాన్ 7 పరుగులు చేసి రాహుల్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు.
undefined
47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసిన నితీశ్ రాణా కూడా రాహుల్ చాహార్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 122 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది కేకేఆర్...
undefined
9 బంతుల్లో 9 పరుగులు చేసిన షకీబ్ అల్ హసన్ అవుటైన తర్వాత దినేశ్ కార్తీక్, ఆండ్రూ రస్సెల్ కలిసి సింగిల్స్ తీయడానికే ప్రాధాన్యం ఇచ్చారు...
undefined
దాంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 15 పరుగులు కావాల్సిన స్థితికి చేరుకుంది కోల్‌కత్తా. ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో మూడో బంతికి రస్సెల్ అవుట్ కాగా, ఆ తర్వాతి బంతికి ప్యాట్ కమ్మిన్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
undefined
ఆఖరి రెండు బంతుల్లో 12 పరుగులు కావాల్సిన దశలో హర్భజన్ సింగ్ 2 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 142 పరుగుల వద్ద నిలిచిపోయింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...
undefined
ముంబై బౌలర్లలో రాహుల్ చాహార్ 4 వికెట్లు తీయగా, కృనాల్ పాండ్యా ఓ వికెట్, ట్రెంట్ బౌల్ట్ ఆఖరి ఓవర్‌లో 2 వికెట్లు తీశారు. 19వ ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చిన బుమ్రా, 4 ఓవర్లలో 28 పరుగులిచ్చాడు.
undefined
click me!