భువీ ఉండగా ఆఖరి ఓవర్‌ ఆవేశ్ ఖాన్‌కి ఎందుకు ఇచ్చినట్టు... కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ...

Published : Aug 02, 2022, 06:47 PM IST

తొలి టీ20 మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టుకి రెండో టీ20లో షాక్ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 138 పరుగులకి ఆలౌట్ కాగా ఆ లక్ష్యాన్ని ఆఖరి ఓవర్‌లో ఛేదించి విజయాన్ని అందుకుంది వెస్టిండీస్...

PREV
18
భువీ ఉండగా ఆఖరి ఓవర్‌ ఆవేశ్ ఖాన్‌కి ఎందుకు ఇచ్చినట్టు... కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ...
Arshdeep Singh

వెస్టిండీస్ విజయానికి ఆఖరి 3 ఓవర్లలో 27 పరుగులు కావాల్సిన దశలో హార్దిక్ పాండ్యా 18వ ఓవర్‌లో ఏకంగా 11 పరుగులు సమర్పించాడు. దీంతో 19వ ఓవర్‌ మ్యాచ్‌కి కీలకంగా మారింది...

28
Image credit: Getty

17వ ఓవర్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, 19వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి డేంజర్ మ్యాన్ రోవ్‌మెన్ పావెల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు...
 

38

ఆఖరి ఓవర్‌లో వెస్టిండీస్ విజయానికి 6 బంతుల్లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. జట్టులో ఉన్న సీనియర్ పేసర్, డెత్ ఓవర్ స్పెషలిస్ట్ భువనేశ్వర్ కుమార్ అప్పటికి 2 ఓవర్లు మాత్రమే వేశాడు. అందరూ ఆఖరి ఓవర్‌లో భువీ బౌలింగ్ చేస్తాడని భావించారు.

48

అయితే అన్యూహ్యంగా అప్పటికే భారీగా పరుగులు ఇచ్చి ఆవేశ్ ఖాన్‌కి బాల్‌ని అందించాడు రోహిత్ శర్మ. 20వ ఓవర్‌లో మొదటి బంతినే నో బాల్‌గా వేసిన ఆవేశ్ ఖాన్, ఆ తర్వాత ఫ్రీ హిట్‌లో 6,  రెండో బంతికి ఫోర్ సమర్పించేశాడు. దీంతో మ్యాచ్ 19.2 ఓవర్లలోనే ముగిసిపోయింది...

58
Image credit: PTI

భువనేశ్వర్ కుమార్ టీమ్‌లో ఉండి, బౌలింగ్ వేసేందుకు ఫిట్‌గా ఉన్నా అతనితో ఆఖరి ఓవర్ ఎందుకు వేయించలేదు? అనేది క్రికెట్ ఫ్యాన్స్‌ని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న. అయితే దీనికి రోహిత్ శర్మ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పాడు...

68
Image credit: PTI

‘ఆఖరి ఓవర్‌లో భువీకి బౌలింగ్ ఇస్తే అతను ఈజీగా ఆ 10 పరుగులను కట్టడి చేయగలడని తెలుసు. అయితే అసలు విషయం అవకాశాలు ఇవ్వడంలోనే ఉంది. ఆవేశ్ ఖాన్‌కి కానీ, అర్ష్‌దీప్ సింగ్‌కి కానీ అవకాశాలు ఇవ్వకపోతే వాళ్లు, ఆఖరి ఓవర్‌లలో ఎలా రాణించగలరో తెలీదు కదా...

78
Image credit: PTI

వారిలో పుష్కలమైన స్కిల్స్ ఉన్నాయి, టాలెంట్ ఉంది. వారికి సపోర్ట్ కావాలి. మేం చేసింది తక్కువ పరుగులే అయినా ఆఖరి ఓవర్‌ వరకూ వారిని నిలువరించగలిగామంటే దానికి బౌలర్లే కారణం.. 

88

ఈ మాత్రం టార్గెట్‌ని వాళ్లు 13-14 ఓవర్లలో కొట్టేసేవాళ్లు. మా బౌలర్లు పక్కా ప్లానింగ్‌తో బౌలింగ్ చేసి మ్యాచ్‌ని ఆఖరి ఓవర్‌ వరకూ తీసుకురాగలిగారు. బ్యాటింగ్‌లో మరికొన్ని పరుగులు చేసి ఉంటే విజయం మాదే...’ అంటూ వివరణ ఇచ్చాడు రోహిత్ శర్మ...

Read more Photos on
click me!

Recommended Stories