17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌కు ఇంగ్లాండ్.. ధృవీకరించిన ఇరు దేశాల క్రికెట్ బోర్డులు

Published : Aug 02, 2022, 04:58 PM IST

PAk vs ENG: అగ్రదేశాలతో స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడించాలని చూస్తున్న పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ శుభవార్త చెప్పింది. తాము  పాకిస్తాన్ పర్యటనకు వస్తున్నామని ధృవీకరించింది. 

PREV
17
17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌కు ఇంగ్లాండ్.. ధృవీకరించిన ఇరు దేశాల క్రికెట్ బోర్డులు

ఇటీవల ఆస్ట్రేలియాతో మూడు ఫార్మాట్ల సిరీస్ లను విజయవంతంగా నిర్వహించడంతో పాకిస్తాన్.. అంతర్జాతీయ సిరీస్ ల మీద దృష్టి సారించింది. గడిచిన దశాబ్దకాలంగా ఆ దేశానికి వెస్టిండీస్, జింబాబ్వే, బంగ్లాదేశ్ వంటి చిన్న జట్లే తప్ప ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా లు ఆ దేశం వంక కన్నెత్తి కూడా చూడలేదు. 

27

కానీ రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మెన్ అయ్యాక ఈ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో పాకిస్తాన్.. ఆస్ట్రేలియాతో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఏకైక టీ20 మ్యాచులను విజయవంతంగా నిర్వహించింది.  దీంతో పీసీబీ.. తాము అంతర్జాతీయ జట్లకు భద్రత కల్పిస్తామని ప్రపంచానికి హామీ ఇచ్చినట్టైంది. 

37

దీంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కూడా పాకిస్తాన్  పర్యటనకు రావడానికి ఒప్పుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఏడు  మ్యాచుల టీ20 సిరీస్ తో పాటు డిసెంబర్ లో మూడు టెస్టులు ఆడేందుకు ఒప్పుకుంది. టెస్టుల షెడ్యూల్ ఇంకా విడుదల కాకపోయినప్పటికీ పొట్టి ఫార్మాట్ షెడ్యూల్ మాత్రం విడులైంది. 

47

సెప్టెంబర్ 20 నుంచి ఈ ఇరుదేశాల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి నాలుగు టీ20లు  కరాచీ వేదికగా (సెప్టెంబర్ 20, 22, 23, 25) జరుగుతాయి. ఆ తర్వాత చివరి మూడు మ్యాచులు (సెప్టెంబర్ 28, 30, అక్టోబర్ 2) లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు  ధృవీకరించాయి. 

57

టీ20 సిరీస్ ముగిశాక ఇంగ్లాండ్ జట్టు  ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. అక్కడ అక్టోబర్ 16 నుంచి జరుగబోయే టీ20 ప్రపంచకప్ లో పాల్గొంటుంది. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ లో మూడు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్ కు రానుంది బ్రిటీష్ జట్టు. 

67

వాస్తవానికి ఇంగ్లాండ్ జట్టు గతేడాది నవంబర్ లోనే పాకిస్తాన్  పర్యటనకు రావాల్సిఉంది. కానీ అంతకుముందే సెప్టెంబర్ లో న్యూజిలాండ్ చివరిక్షణంలో   తమ పర్యటనను రద్దు చేసుకుంది. భద్రతా కారణాలను చూపి కివీస్ అర్థాంతరంగా సిరీస్ రద్దు చేసుకుని వెళ్లిపోయింది. దీంతో ఇంగ్లాండ్ కూడా పునరాలోచనలో పడింది. తమ ఆటగాళ్ల మానసిక ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పి పర్యటనను వాయిదా వేసుకుంది. 

77

ఇంగ్లాండ్ జట్టు చివరిసారి 2005లో పాకిస్తాన్ పర్యటనకు వచ్చింది. ఆ తర్వాత పాక్ లో శ్రీలంక ఆటగాళ్ల మీద ఉగ్రదాడులు జరగడంతో  ఆ దేశంపై కొన్నాళ్లు నిషేధం విధించారు. ఆ తర్వాత కూడా అంతర్జాతీయ సిరీస్ ల కోసం పాకిస్తాన్ ప్రయత్నించినా అగ్రదేశాలు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితుల్లో కాస్త మార్పు కనబడుతున్నది. 

Read more Photos on
click me!

Recommended Stories