భువనేశ్వర్ కమ్‌బ్యాక్, సిరీస్ గెలవడం కంటే ఎక్కువే... చాలారోజుల తర్వాత...

First Published Mar 21, 2021, 3:24 PM IST

భువనేశ్వర్ కుమార్... గత ఏడెనిమిది ఏళ్లుగా టీమిండియాలో చాలా కీలకంగా మారిన బౌలర్. భువనేశ్వర్ బౌలింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభించడం, మొదటి ఓవర్‌లోనే వికెట్ తీసి టీమిండియాకి బ్రేక్ అందించడం చాలా కామన్. అయితే కరోనా లాక్‌డౌన్ కంటే ముందే ఫామ్‌ కోల్పోయాడు భువనేశ్వర్ కుమార్. 

పెద్దగా ఫామ్‌లో లేకుండా ఐపీఎల్ 2020 సీజన్‌లో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్, నాలుగు మ్యాచులాడి కేవలం 3 వికెట్లు మాత్రమే తీశాడు. అందులో రెండు వికెట్లు ఒకే మ్యాచ్‌లో దక్కాయి...
undefined
అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో గాయపడిన భువనేశ్వర్ కుమార్, టీమిండియాకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియా టూర్‌తో పాటు ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌కూ దూరమయ్యాడు భువీ...
undefined
గాయం నుంచి కోలుకుని సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీతో పాటు విజయ్ హాజారే ట్రోఫీలో అదరగొట్టిన భువీకి దాదాపు ఐదు నెలల తర్వాత టీమిండియా నుంచి పిలుపు వచ్చింది...
undefined
ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో ప్రభావం చూపలేకపోయిన భువనేశ్వర్ కుమార్, రెండో టీ20లో మొదటి ఓవర్‌లోనే డేంజరస్ జోస్ బట్లర్‌ను అవుట్ చేసి అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు...
undefined
మూడో టీ20లో వికెట్లేమీ తీయలేకపోయిన భువీ, నాలుగో టీ20లో తన రెండో ఓవర్‌లో మరోసారి బట్లర్‌ను అవుట్ చేశాడు...
undefined
నిర్ణయాత్మక ఆఖరి టీ20లో పాత భువీని చూసే అదృష్టం అభిమానులకు దక్కింది. కీలకమైన మ్యాచ్‌లో జాసన్ రాయ్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన భువీ, మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులిస్తున్న సమయంలో బంతి అందుకుని మ్యాజిక్ చేశాడు.
undefined
సిరీస్‌లో రెండు సార్లు భువీ బౌలింగ్‌లో అవుటైన బట్లర్, మరోసారి కీలక సమయంలో అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. బట్లర్, మలాన్ భారీ భాగస్వామ్యంతో అప్పటిదాకా లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించిన ఇంగ్లాండ్... ఒత్తిడిలోకి వెళ్లి, వరుస వికెట్లు కోల్పోయింది.
undefined
ఇంగ్లాండ్‌ బౌలర్లతో పాటు టీమిండియా బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు సమర్పించిన పిచ్‌పై 4 ఓవర్లలో 15 పరుగులే ఇచ్చిన భువనేశ్వర్ కుమార్, కీలకమైన రెండు వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు...
undefined
భువనేశ్వర్ తన ఫామ్‌ను అందుకున్నాడు. ఇక మిగిలింది పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్న బుమ్రా రీఎంట్రీ ఇవ్వడమే. బుమ్రా, భువనేశ్వర్ జోడి పేస్ విభాగాన్ని నడిపిస్తుంటే, టీమిండియా బౌలింగ్ కష్టాలు సగం తీరినట్టే..
undefined
ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు భువనేశ్వర్ కుమార్ ఫామ్‌లోకి రావడం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కూడా కలిసొచ్చే అంశం...
undefined
click me!