టెండూల్కర్ రికార్డుకి అడుగు దూరంలో విరాట్ కోహ్లీ... ఒకే సిరీస్‌లో ఏకంగా 14 రికార్డులు...

Published : Mar 21, 2021, 02:50 PM IST

టెస్టు సిరీస్‌తో పాటు టీ20 సిరీస్ ఆరంభంలో ఫామ్ లేమితో అనేక విమర్శలు ఎదుర్కొన్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, పొట్టి ఫార్మాట్‌ ముగిసేసరికి తన ఫామ్‌ని అందిపుచ్చుకున్నాడు. అంతేనా తన పర్ఫామెన్స్‌తో టీ20 సిరీస్‌లో అనేక రికార్డులు క్రియేట్ చేశాడు.

PREV
112
టెండూల్కర్ రికార్డుకి అడుగు దూరంలో విరాట్ కోహ్లీ... ఒకే సిరీస్‌లో  ఏకంగా 14 రికార్డులు...

మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, నాలుగో మ్యాచ్‌లో 1 పరుగుకే అవుట్ అయ్యాడు. అయితే మిగిలిన మూడు మ్యాచుల్లో 73, 77, 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు విరాట్ కోహ్లీ...

212

ఒకే సిరీస్‌లో మూడు సార్లు 70+ స్కోర్లు నమోదుచేసిన మొట్టమొదటి క్రికెటర్ విరాట్ కోహ్లీయే. అంతేకాకుండా ఇంగ్లాండ్‌పై 500+ పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్.

312

ఇంతకుముందు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై కూడా 500+ టీ20 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ... మూడు దేశాలపై ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచాడు. రోహిత్ విండీస్‌పై, ఫించ్ ఇంగ్లాండ్‌పై, హఫీజ్ న్యూజిలాండ్‌పై ఈ ఫీట్ సాధించారు...

412

ఐదో టీ20లో చేసిన 80 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో 13 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

512

260 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించిన విరాట్, అత్యంత వేగంగా ఈ రికార్డు సృష్టించిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 277 ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డు అందుకున్నాడు...

612

ఐదో టీ20లో టీమిండియా 200+ చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా ఈ ఫీట్ సాధించడం 11వ సారి. కేన్ విలియంసన్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ ఆరు సార్లు 200+ స్కోరు చేసి రెండో స్థానంలో ఉంది...

712

టీ20 కెప్టెన్‌గా అత్యధిక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలిచిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ, ఓవరాల్‌గా తన కెరీర్‌లో 19వ సారి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. సచిన్ టెండూల్కర్ 20 ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు కోహ్లీ...

812

ఈ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఏకంగా 14 రికార్డులు క్రియేట్ చేయడం విశేషం. టీ20ల్లో 3 వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా, 50 సిక్సర్లు బాదిన మొదటి భారత కెప్టెన్‌గా నిలిచిన విరాట్, ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ నిలిచాడు...

912

టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా అత్యంత వేగంగా 12 వేల పరుగులు పూర్తిచేసుకున్నాడు...

1012

ఇంగ్లాండ్‌పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గానూ ఫించ్‌ని అధిగమించాడు...

1112

51 సార్లు 50+ స్కోర్లు చేసి అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న (49 సార్లు) రికార్డును తుడిచి పెట్టేశాడు...

1212

వరుసగా 8 టీ20 సిరీస్‌లు గెలిచిన విరాట్ కోహ్లీ, రెండేళ్ల తర్వాత ఇంగ్లాండ్‌కి ఓటమి రుచి చూపించాడు. చివరిసారిగా 2018లో టీమిండియా చేతిలో టీ20 సిరీస్ ఓడిన ఇంగ్లాండ్, మళ్లీ 2021లో టీమిండియా చేతుల్లోనే టీ20 సిరీస్ కోల్పోయింది.
 
click me!

Recommended Stories