ఇంగ్లాండ్ టూర్‌కి ఆ ఇద్దరు బౌలర్లు... గాయపడిన సుందర్, ఆవేశ్ ఖాన్ స్థానంలో...

First Published Jul 23, 2021, 7:03 PM IST

ఇంగ్లాండ్ టూర్ ఆరంభానికి ముందే భారత జట్టును గాయాల వేధిస్తున్న విషయం తెలిసిందే. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గాయపడి శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్, ఆవేశ్ ఖాన్ గాయపడి జట్టుకి దూరమయ్యారు...

టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే ముగ్గురు ప్లేయర్లు గాయపడి, జట్టుకి దూరం కావడంతో వారికి రిప్లేస్‌మెంట్‌గా ప్లేయర్లను పంపాలని బీసీసీఐ సెలక్టర్లను కోరింది టీమ్ మేనేజ్‌మెంట్...
undefined
శుబ్‌మన్ గిల్ గాయపడిన తర్వాత శ్రీలంక టూర్‌లో ఉన్న పృథ్వీషా, దేవ్‌దత్ పడిక్కల్‌ను పంపాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరినా, సెలక్టర్లు ఆ డిమాండ్‌ను తిరస్కరించారు...
undefined
ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్‌లను వాడుకోవాలని, ముగ్గురు ప్లేయర్లు అదనంగా ఉన్నప్పుడు మరో ప్లేయర్‌తో అవసరం ఏముందని ప్రశ్నించారు సెలక్టర్లు.
undefined
అయితే ఈసారి మాత్రం టీమ్ మేనేజ్‌మెంట్ కోరికపై బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఆస్ట్రేలియా టూర్‌లో భారత జట్టు గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడింది.
undefined
నాలుగు టెస్టుల సిరీస్‌లో దాదాపు 8 మంది గాయాలతో దూరం కావడంతో గబ్బా టెస్టులో వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, నటరాజన్, నవ్‌దీప్ సైనీ వంటి కొత్త కుర్రాళ్లతో బరిలో దిగాల్సి వచ్చింది. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండేందుకు ఇంగ్లాండ్ టూర్‌కి ఇద్దరు బౌలర్లను పంపాలని భావిస్తోంది బీసీసీఐ.
undefined
శ్రీలంక టూర్‌లో ఉన్న స్వింగ్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్‌లను ఇంగ్లాండ్‌ టూర్‌కి పంపేందుకు చర్చలు జరుపుతోంది బీసీసీఐ. భువీకి ఇంగ్లాండ్‌లో మంచి రికార్డు ఉంది....
undefined
2014 టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్, టీమిండియా సిరీస్ కోల్పోయినా ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టును ఇబ్బంది పెట్టిన కేల్ జెమ్మీసన్‌కి సమానమైన టాలెంటెడ్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్.
undefined
అందుకే స్వింగ్‌కి చక్కగా అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్‌లపై భువనేశ్వర్‌ కుమార్‌ సేవలను వినియోగించుకోవాలని భావిస్తోందట బీసీసీఐ. అతనితో పాటు దీపక్ చాహార్‌ను కూడా ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలనే ఆలోచనలో ఉంది.
undefined
అయితే తొలి టెస్టుకి కాకపోయినా రెండో టెస్టు సమయానికి అందుబాటులో ఉండేలా భువనేశ్వర్ కుమార్‌ను ఇప్పుడే ఇంగ్లాండ్ టూర్‌కి పంపాలని భావిస్తోంది బీసీసీఐ. ఈ విషయమై భువనేశ్వర్ కుమార్‌తో చర్చలు జరుపుతున్నట్టు బీసీసీఐ అధికారి తెలిపారు.
undefined
click me!