కొందరు పాకిస్థాన్ క్రికెటర్ల భార్యలు సినిమారంగంలో నటీమణులుగానే కాదు పెద్దపెద్ద చదువులు చదివిన ఇంజనీర్లు, లాయర్లు కూడా ఉన్నారు. ఏ క్రికెటర్ భార్య ఏ ప్రొఫెషన్ లో ఉన్నారో ఇక్కడ తెలుసుకుందాం.
పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ గా గుర్తింపుపొందిన మాజీ క్రికెటర్ మహ్మద్ అమీర్, బ్రిటిష్-పాకిస్థానీ లాయర్ అయిన నర్జిస్‌ను పెళ్లి చేసుకున్నాడు. అమీర్ ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిశారు… ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి తర్వాత ఆమె లండన్ నుండి పాకిస్థాన్‌కు షిఫ్ట్ అయ్యారు. ఈ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు.
28
Shaheen Afridi and Ansha Afridi
పాకిస్థానీ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూతురు అన్షాను వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్‌లోని అత్యంత పలుకుబడి కలిగిన కుటుంబాల్లో అఫ్రిదీలు కూడా ఉంటారు. దీంతో వీరి పెళ్లి ఇటు క్రికెట్, అటు పవర్ ఫుల్ ఫ్యామిలీల కలయికగా నిలిచింది.
38
Wahab Riaz and Zainab Chaudhry
పాకిస్థానీ మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ ఓ బిజినెస్ ఫ్యామిలీకి చెందిన జైనబ్‌ను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె ఎక్కువగా పబ్లిక్‌లో కనిపించరు… తన పర్సనల్ లైఫ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.
ఫాస్ట్ బౌలర్ హసన్ అలీ యూఏఈలో నివాసముండే భారతీయ యువతి సామియా ఆర్జూను పెళ్లి చేసుకున్నాడు. ఈమె ఏరోనాటికల్ ఇంజనీర్. దుబాయ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మొదలైన వీరి ప్రేమకథ పెళ్లికి దారితీసింది… 2019 లో దుబాయ్ లో వీరి వివాహం జరిగింది. వీరికి హెలేనా, హాజెల్ ఇద్దరు అమ్మాయిలు సంతానం.
58
Shoaib Malik and Sana Javed
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ 2024లో ప్రముఖ టీవీ నటి సనా జావేద్‌ను పెళ్లి చేసుకున్నాడు. 'ఖానీ', 'రుస్వాయి' వంటి హిట్ షోలతో ఆమె పాపులర్ అయ్యారు. సౌదీ అరేబియాలో పుట్టి పాకిస్థాన్‌లో పెరిగిన సనా, దేశంలోని సక్సెస్‌ఫుల్ టీవీ స్టార్లలో ఒకరు.
అయితే అంతకుమందు ఇండియన్ టెన్నిస్ట్ ప్లేయర్ సానియా మీర్జాను పెళ్లిచేసుకున్నాడు షోయబ్. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ విడిపోయారు.. ప్రస్తుతం కొడుకు సానియా వద్దే పెరుగుతున్నాడు.
68
Imad Wasim and Sania Ashfaq
పాకిస్థానీ ఆల్-రౌండర్ ఇమాద్ వసీం లండన్‌లో ఉండే పాకిస్థానీ అమ్మాయి సానియా అష్ఫాక్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు పిల్లలు ఉన్నారు. వీరు తమ ఫ్యామిలీ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
78
Sarfaraz Ahmed and Khushbakht Sarfaraz.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కరాచీకి చెందిన గృహిణి ఖుష్‌బఖ్త్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు పిల్లలు ఉన్నారు. తమ ఫ్యామిలీ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచడానికే వీరు ఇష్టపడతారు. వీరిద్దరి మధ్య అన్యోన్యత, బలమైన బంధాన్ని చాలామంది ప్రశంసిస్తారు.
88
Shehzar Mohammad and Sohai Ali Abro
క్రికెటర్ షెహజార్ మహ్మద్, 2021లో ఫిల్మ్, టీవీ నటి సోహై అలీ అబ్రోను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పాకిస్థానీ సినిమాల్లో పాపులర్ యాక్టర్. ఈ జంటకు 2022లో కూతురు పుట్టింది.