ఇంగ్లాండ్ అభిమానులపై బెన్ స్టోక్స్ గుస్సా... క్రికెట్ లో దానికి చోటు లేదంటూ ఆగ్రహం..

Published : Jul 07, 2022, 08:42 PM IST

ENG vs IND: ఎడ్జబాస్టన్ టెస్టులో భారత జట్టు అభిమానులపై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ వ్యవహరించిన తీరుపై ఆ జట్టు టెస్టు సారథి బెన్ స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

PREV
16
ఇంగ్లాండ్ అభిమానులపై బెన్ స్టోక్స్ గుస్సా... క్రికెట్ లో దానికి చోటు లేదంటూ ఆగ్రహం..

ఎడ్జబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ అభిమానులు వ్యవహరించిన తీరుపై ఆ జట్టు  సారథి బెన్ స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఆట నాలుగో  రోజులో భాగంగా పలువురు ఇంగ్లీష్ అభిమానులు (బర్మీ ఆర్మీతో కలిపి) స్టాండ్స్ లో మ్యాచ్ చూస్తున్న భారత అభిమానులతో పాటు ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. 

26

స్టేడియంలోని బ్లాక్ 22 ఎరిక్ హాల్లీస్ వద్ద పలువురు ఇంగ్లీష్ అభిమానులు టీమిండియా ఫ్యాన్స్ ను టార్గెట్ గా చేసుకుని ఇష్టారీతిన వాగారు.  దీనిపై పలువురు భారత అభిమానులు గ్రౌండ్  సిబ్బందితో పాటు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కి కూడా సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. 

36

దీనిపై తాజాగా స్టోక్స్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘గతవారం అద్భుతంగా గడిచింది. కానీ ఎడ్జబాస్టన్ లో  జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారన్న వార్తలు నన్ను నిరాశకు గురిచేశాయి. ఆటలో రేసిజానికి ఆస్కారమే లేదు. 

46
England, Prime Minister, Boris Johnson,

ఈ టెస్టులో అభిమానులంతా మంచి క్రికెట్ ను ఆస్వాదించారని ఆశిస్తున్నా. మీ వల్లే అక్కడ పార్టీ వాతావరణం ఏర్పడింది. క్రికెట్ అంటే అదే..’ అని ట్వీట్ చేశాడు. 
 

56

ఎడ్బబాస్టన్ టెస్టులో ఇంగ్లాండ్ అభిమానుల తీరుపై టీమిండియా ఫ్యాన్స్  అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై ట్విటర్ లో పలువురు స్పందిస్తూ.. ‘ఇక్కడ  ఇంగ్లీష్ వాళ్లు ఇండియా ఫ్యాన్స్ మీద రేసిజం కామెంట్స్ చేస్తున్నారు.  ఇది మంచి పద్దతి కాదు. ఎవరిమీదైనా రేసిజం కేస్ నమోదైతే జీవితకాల నిషేధం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. క్రికెట్ ఒక ఆట మాత్రమే..’ అని కామెంట్ చేశాడు.

66

ఇదిలాఉండగా  జాత్యాహంకార ఫిర్యాదులపై ఈసీబీ స్పందించింది. వాటిని ఉపేక్షించబోమని ప్రకటించింది. ఎడ్జబాస్టన్ టెస్టులో ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో.. ‘మ్యాచ్ లో  రేసిజం కామెంట్స్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఇది చాలా ఆందోళనకరం. ఈ విషయంపై మేము గ్రౌండ్ సిబ్బంది, అధికారుల నుంచి  సమాచారం సేకరిస్తున్నాం. దీనిపై మేము విచారణ చేపడతాం.  క్రికెట్ లో రేసిజానికి ఆస్కారమే లేదు..’ అని ఒక ప్రకటనలో తెలిపింది. 

click me!

Recommended Stories