బెన్ స్టోక్స్ సరైన సమయంలోనే తప్పుకున్నాడు!లేదంటే విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్‌ల గతే పట్టేది...

Published : Jul 21, 2022, 12:52 PM IST

ఇంగ్లాండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకున్న నిర్ణయం తీసుకోవడం ఇంగ్లాండ్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. వన్డే వరల్డ్ కప్ 2019 గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న బెన్ స్టోక్స్, అర్ధాంతరంగా వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడంపై స్పందించాడు ఆ దేశ మాజీ క్రికెటర్ నాజర్ హుస్సేన్..

PREV
17
బెన్ స్టోక్స్ సరైన సమయంలోనే తప్పుకున్నాడు!లేదంటే విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్‌ల గతే పట్టేది...

టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్న బెన్ స్టోక్స్.. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తన ఆఖరి వన్డేలో 11 బంతుల్లో 5 పరుగులు చేసి అయిడిన్ మార్క్‌రమ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు బెన్ స్టోక్స్...

27
Image credit: Getty

టెస్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత వరుస విజయాలు అందుకుంటూ, ఇంగ్లాండ్ జట్టును డబ్ల్యూటీసీ 2021-23 పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్ నుంచి పైకి తీసుకొచ్చాడు బెన్ స్టోక్స్..

37

‘బెన్ స్టోక్స్ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో చాలా సక్సెస్ చూశాడు. బెన్ స్టోక్స్ 80 శాతం ఫిట్‌గా ఉన్నా మ్యాచ్‌లను గెలిపించగలడని చాలామంది అనుకుంటారు...
 

47
Ben Stokes

వన్డేల్లో 100 శాతం ఆడలేకపోతే అది మిగిలిన ఫార్మాట్లపై ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. వన్డేల్లో ఫెయిల్ అయితే వేరే ఫార్మాట్‌లోనూ ఫామ్ కొనసాగించడం కష్టం కావచ్చు.. ఇప్పుడు విరాట్ కోహ్లీ, కేన్ విలియంసన్‌లకు ఏం జరిగిందో అందరికీ తెలుసు...

57

వాళ్లు కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలోనూ పరుగులు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏ ఫార్మాట్‌లోనూ పరుగులు చేయలేకపోతున్నారు. బెన్ స్టోక్స్ ఫిట్‌గా ఉన్నప్పుడు చాలా విజయాలు అందుకున్నాడు.. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించాడు...

67

అయితే ఆఖరి వన్డేలో అతని ఆటతీరు పూర్తిభిన్నంగా అనిపించింది. కొన్ని బంతులు ఎదుర్కొన్న తర్వాత అతను భారీ షాట్స్ ఆడడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించాడు. క్రీజులో కుదురుకోవడానికి కష్టపడుతున్నట్టు అనిపించింది...

77
Jonny Bairstow-Ben Stokes

ఆఖరి వన్డేలో బెన్ స్టోక్స్ ఆడిన తీరు చూశాక అతను ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడమే సరైన నిర్ణయమని అనిపించింది. కనీసం మిగిలిన రెండు ఫార్మాట్లపై అతను పూర్తి ఫోకస్ పెట్టడానికి అవకాశం దొరికింది...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, క్రికెటర్ నాజర్ హుస్సీన్.. 

Read more Photos on
click me!

Recommended Stories