hat trick in T20 Blast: విటాలిటీ బ్లాస్ట్‌లో బెన్ సాండర్సన్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసి నార్తాంప్టన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
hat trick in T20 Blast: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ 2025 టోర్నమెంట్‌లో నార్తాంప్టన్‌షైర్ బౌలర్ బెన్ సాండర్సన్ అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ సాండర్స్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు.
25
హ్యాట్రిక్ తో పాటు మొత్తం 6 వికెట్లు తీసిన బెన్ సాండర్సన్
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో దిగిన వార్సెస్టర్‌షైర్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించినది బెన్ సాండర్సన్. ఒక హ్యాట్రిక్ తో పాటు ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసుకున్నాడు.
35
బెన్ సాండర్సన్ అద్భుత బౌలింగ్
బెన్ సాండర్సన్ తన నాలుగు ఓవర్ల బౌలింగ్ లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. అతని అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు దడపుట్టించాడు.
వార్సెస్టర్‌షైర్ బ్యాటర్లను సాండర్సన్ తన సూపర్ బౌలింగ్‌తో దెబ్బకొట్టాడు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో జరిగిన సంఘటన క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.
ఈ మ్యాచ్ లో బెన్ సాండర్సన్ ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసకున్నాడు. 19 ఓవర్ తొలి బంతికి టామ్ హీన్లీ ఔట్ చేశాడు. రెండో బంతికి ఒక రన్ వచ్చింది. మూడో బంతి డాట్ బాల్ అయింది. నాలుగవ బంతికి బెన్ డ్వార్షుయిస్ ఔట్ అయ్యాడు. ఐదవ బంతికి ఆడమ్ ఫించ్ ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియంలో ఒకటే ఉత్కంఠ. హ్యాట్రిక్ వస్తుందా అని. అనుకున్నట్టుగానే అద్భుతమైన ఆరవ డెలివరీతో జాకబ్ డఫీని అవుట్ చేసి బెన్ సాండర్సన్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
ఈ విధంగా ఒకే ఓవర్‌లో వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించిన బెన్ సాండర్సన్.. నార్తాంప్టన్‌షైర్‌కు అద్భుత విజయం అందించాడు.
55
సాండర్సన్ vs వార్సెస్టర్‌షైర్: మ్యాచ్ స్కోర్ బోర్డ్
• నార్తాంప్టన్‌షైర్: 190/8 (20 ఓవర్లు)
• వార్సెస్టర్‌షైర్: 159 ఆలౌట్
• ఫలితం: నార్తాంప్టన్‌షైర్ 31 పరుగులతో గెలిచింది
ఈ విజయం తర్వాత, బెన్ సాండర్సన్ ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విటాలిటీ బ్లాస్ట్‌లో ఇది ఇప్పటివరకు కనిపించిన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.