క్వారంటైన్ అక్కర్లేదు, నేరుగా వచ్చి ఆడండి... ప్లేయర్లకు ఐపీఎల్ ఆఫర్...

First Published Mar 21, 2021, 1:07 PM IST

యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు 14 రోజుల పాటు కఠినమైన క్వారంటైన్‌లో గడిపారు క్రికెటర్లు. అయితే ఆ తర్వాత కొన్నిరోజులకు తప్పనిసరి క్వారంటైన్ పీరియడ్‌ను 6 రోజులకు కుదించింది యూఏఈ...

ఐపీఎల్ 2021 సీజన్‌ను స్వదేశంలోనే నిర్వహించబోతోంది బీసీసీఐ. దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐపీఎల్‌లో పాల్గొనే ప్లేయర్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది భారత క్రికెట్ బోర్డు...
undefined
ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లో మొట్టమొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది...
undefined
దేశంలోని ఆరు నగరాల్లో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏ జట్టూ కూడా సొంత మైదానంలో ఆడడం లేదు. ఐపీఎల్ 2021 సీజన్‌లో బబుల్ టు బబుల్ మార్పిడికి అవకాశం ఇచ్చింది బీసీసీఐ...
undefined
ఐపీఎల్ కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం బయో బబుల్‌లో మ్యాచులు ఆడుతున్న ఇంగ్లాండ్, ఇండియా జట్టు ప్లేయర్లు నేరుగా ఐపీఎల్‌లో తమ జట్ల తరుపున పాల్గొనవచ్చు. మళ్లీ క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు...
undefined
అలాగే విదేశాల్లో బయో బబుల్‌లో మ్యాచులు ఆడుతున్న ఆఫ్ఘాన్, సౌతాఫ్రికా వంటి జట్ల ప్లేయర్లకి కూడా క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా ఐపీఎల్‌లో పాల్గొనే వెసులుబాటు కలిగించింది బీసీసీఐ.
undefined
అయిత ప్లేయర్ల రవాణా, వాళ్ల మ్యాచులు ఆడిన ప్రదేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆయా ఫ్రాంఛైజీలు అవసరమైతే క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా ప్లేయర్లకు సూచించవచ్చు...
undefined
ఆరు నగరాల్లో మ్యాచులు నిర్వహించబోతున్న బీసీసీఐ... మ్యాచులు లేకుండా, బయో బబుల్‌లో గడపకుండా ఐపీఎల్‌కి వచ్చే ఆటగాళ్లు, యజమానులు, కామెంటేటర్లు, తదితరులకు ఏడు రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేసింది...
undefined
టీ20 సిరీస్ తర్వాత ఈ నెల 23 నుంచి ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఇది మార్చి 28న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత నేరుగా ఐపీఎల్ ఆడబోతున్నారు కొందరు ఇంగ్లాండ్ క్రికెటర్లు...
undefined
అయితే బిజీ షెడ్యూల్ కారణంగా నెలన్నరగా బయో బబుల్‌లో గడుపుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వంటి కొందరు భారత క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ ఆరంభానికి ముందు నాలుగు రోజుల సెలవు తీసుకోనున్నట్టు సమాచారం.
undefined
ఇలా బయో బబుల్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంటికి వెళ్లిన ప్లేయర్లు మాత్రం, ఐపీఎల్‌లో ఆడే ముందు మళ్లీ 7 రోజుల పాటు క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది...
undefined
click me!