మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి హయాంలో భారత జట్టు అద్భుత విజయాలు అందుకుంది. విదేశాల్లో టెస్టు సిరీస్‌లు గెలిచి, టాప్ టీమ్‌గా నిలిచింది. అయితే ఐసీసీ టోర్నీల్లో మాత్రం సరైన విజయాలు అందుకోలేకపోయింది టీమిండియా...
2019 వన్డే వరల్డ్ కప్‌లో వరుస విజయాలతో సెమీ ఫైనల్స్‌కి దూసుకెళ్లిన భారత జట్టు, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. ఆ తర్వాత రవిశాస్త్రి కోచింగ్‌లో ఆడిన ఆఖరి టోర్నీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలోనూ టీమిండియా ప్రదర్శన ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచింది...
27
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో మొట్టమొదటిసారి పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా, ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లోనూ ఓడి గ్రూప్ స్టేజీకే పరిమితమైంది...
37
గాయం కారణంగా రెండేళ్లుగా బౌలింగ్ చేయలేకపోతున్న ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ జట్టులో చోటు కల్పించడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై తాజాగా స్పందించాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
47
Ravi Shastri and Virat Kohli
‘మెగా టోర్నీల్లో ఐదుగురు బౌలర్ల ఫార్ములాతో బరిలో దిగితే గెలవడం చాలా కష్టం. హార్ధిక్ పాండ్యా తరుచూ గాయపడుతూ ఉండడంతో అతనికి సరైన రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌ని వెతకాల్సిన సెలక్టర్లకు చెబుతూ వచ్చాం...
57
అయితే సెలక్టర్లు మాత్రం మా గోడు పట్టించుకోలేదు. సరైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అందుబాటులో లేకపోవడం వల్లే మేం రెండు వరల్డ్ కప్స్‌లో ఓడిపోవాల్సి వచ్చింది..
67
Ravi Shastri with Hardik Pandya
హార్ధిక్ పాండ్యా పూర్తి ఫిట్‌గా ఉన్నా, లేక మేం కోరిన పేస్ ఆల్‌రౌండర్‌ని సెలక్టర్లు, ఎంపిక చేసినా ఇప్పటికి రెండు వరల్డ్ కప్స్ గెలిచేవాళ్లం... ఓ రకంగా 2019 వన్డే వరల్డ్ కప్‌లో, 2021 టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓటమికి సెలక్టర్లే కారణం...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...
77
బెన్ స్టోక్స్ వన్డేల నుంచి తప్పుకున్న తర్వాత హార్ధిక్ పాండ్యా కూడా త్వరలోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నాడని, వన్డే వరల్డ్ కప్ తర్వాత అతన్ని వన్డేల్లో చూడడం కష్టమేనని రవిశాస్త్రి చేసిన కామెంట్లు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి...