17 కాదు, జూలై 18 నుంచి శ్రీలంక- భారత్ సిరీస్... బీసీసీఐ సెక్రటరీ ప్రకటన, కొత్త షెడ్యూల్ ఇదే...

First Published Jul 10, 2021, 2:20 PM IST

షెడ్యూల్ ప్రకారం జూలై 13న ప్రారంభం కావాల్సిన ఇండియా, శ్రీలంక వన్డే సిరీస్... లంక జట్టులో కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ నాలుగు రోజులు వాయిదా పడి, జూలై 17 నుంచి ప్రారంభమవుతుందని వార్తలు వచ్చినా, మరో రోజు ముందుకెళ్లింది...

శ్రీలంక బ్యాటింగ్ కోచ్ ఫ్లవర్‌తో పాటు టీమ్ డేటా అనాలసిస్ట్ నిరోషన్ కరోనా పాజిటివ్‌గా తేలారు. వీరితో పాటు శ్రీలంక ప్రధాన జట్టులో భాగం కాని మరో ప్లేయర్‌కి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది...
undefined
దీంతో శ్రీలంక జట్టు మొత్తం ప్రస్తుతం క్వారంటైన్‌లో గడుపుతోంది. జూలై 17 దాకా వీళ్లు క్వారంటైన్‌లోనే ఉంటారు. 17న మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించి, అందరికీ నెగిటివ్ రిజల్ట్ వస్తే... 18 నుంచి సిరీస్ ప్రారంభం అవుతుంది...
undefined
తొలుత జూలై 17 నుంచి ఈ సిరీస్ ప్రారంభం అవుతుందని వార్తలు వచ్చినా... ‘ఇండియా- శ్రీలంక మధ్య వన్డే సిరీస్‌ జూలై 18 నుంచి ప్రారంభమవుతుంది... శ్రీలంక క్యాంపులో కరోనా కేసులే దీనికి కారణం’ అంటూ స్పష్టం చేశాడు బీసీసీఐ సెక్రటరీ జై షా...
undefined
వాస్తవానికి తొలుత అనుకుణ్న షెడ్యూల్ ప్రకారం అయితే జూలై 13న మొదలయ్యే వన్డే సిరీస్, 18న ముగియాలి. అయితే తాజా షెడ్యూల్ ప్రకారం జూలై 18న ప్రారంభమయ్యే వన్డే సిరీస్ 23న ముగియనుంది...
undefined
జూలై 18న మొదటి వన్డే, జూలై 20న రెండో వన్డే, 23న మూడో వన్డే జరుగుతాయి. ఆ తర్వాత జూలై 25న మొదటి టీ20, 27న రెండో టీ20, 29న ఆఖరి టీ20 మ్యాచ్ జరుగుతాయి...
undefined
వాస్తవానికి ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే జూలై 25న లంక టూర్ ముగించుకుని, స్వదేశానికి పయనం కావాల్సిన భారత జట్టు, కరోనా కేసుల కారణంగా మరో ఐదు రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది...
undefined
శ్రీలంక జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడం, మ్యాచ్ ప్రారంభానికి మరో 8 రోజుల సమయం ఉండడంతో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత బృందం మరికొన్ని రోజులు క్వారంటైన్‌, బయో బబుల్‌లో గడపనుంది...
undefined
click me!