గంగూలీయే ఇలా చేస్తున్నప్పుడు, వాళ్లని చేయొద్దని ఎలా చెబుతాం... గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్...

First Published Sep 20, 2022, 2:03 PM IST

బెట్టింగ్ కార్యకలాపాలపై చట్టపరమైన నిషేధం ఉంది. అయితే ఐపీఎల్ వచ్చిన ఆన్‌లైన్ బెట్టింగ్‌ని అధికారికంగా ప్రమోట్ చేయడం మొదలెట్టింది బీసీసీఐ. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష హోదాలో ఉన్న సౌరవ్ గంగూలీ కూడా కొన్ని వెబ్‌సైట్లకు, బెట్టింగ్ యాప్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

‘బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీయే ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు, మిగిలిన క్రికెటర్లను చేయొద్దని ఎలా చెబుతాం... బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం అయినప్పుడు దాన్ని ఎవ్వరూ ప్రమోట్ చేయకూడదు. బీసీసీఐ అధ్యక్షుడు కూడా దీనికి మినహాయింపు కాదు...

VVS Laxman

ప్రతీ ఒక్కరూ రూల్స్ ఫాలో అవ్వాలి. టాప్ పొజిషన్‌లో ఉన్నవాళ్లే వీటిని ఫాలో అయ్యేలా చర్యలు తీసుకోవాలి. లేదా భారత్‌లో పూర్తిగా ఇలాంటి బెట్టింగ్‌ని ఆన్‌లైన్‌లో కూడా బ్యాన్ చేయాలి. కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ చేసి, మరికొన్ని రాష్ట్రాల్లో అనుమతించడం కరెక్ట్ కాదు.

ఇలాంటి వాటికి ఎవ్వరూ ప్రమోట్ చేయకూడదు. ఐపీఎల్‌లో కూడా చాలా వరకూ ఎండార్స్‌మెంట్స్, స్పాన్సర్‌షిప్స్ అన్నీ ఫాంటసీ లీగ్స్ నుంచే వస్తాయి. బీసీసీఐ ఈ విషయం మీద ఓ నిర్ణయం తీసుకోవాలి. వీటిని బ్యాన్ చేస్తే క్రికెట్‌కి మరింత మేలు జరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

‘నేనెప్పుడూ ఇలాంటి వెబ్‌‌సైట్స్‌కి ప్రమోషన్స్ చేయలేదు. నాకు తెలిసి దినేశ్ కార్తీక్‌ని ఓ కంపెనీ ఇలాంటి యాడ్ కోసం సంప్రదించారు. ఆ కంపెనీ పేరు కూడా నాకు గుర్తులేదు. అయితే దినేశ్ కార్తీక్ ఆ యాడ్ చేసేందుకు ఒప్పుకోలేదు...

నేను ఫాంటసీ గేమ్స్ ప్రమోట్ చేస్తాను. ఫాంటసీ గేమ్స్ వేరు, బెట్టింగ్ వేరు. రెండూ ఒకేలా కనిపిస్తాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసే ముందే నేను ఆ ఫాంటసీ గేమ్ యజమానితో మాట్లాడి విషయం తెలుసుకున్నా. జనాలు డబ్బులు కట్టేది ఉంటుందా? అని అడిగా... లేదని చెప్పాకే ఒప్పుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

click me!