ఐపీఎల్ 2022 సీజన్‌లో సీనియర్లు అదరగొడుతున్నారు. గత రెండు సీజన్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన వాళ్లే, ఈసారి ఇరగదీసే పర్ఫామెన్స్‌తో షో మ్యాన్స్‌గా మారుతున్నారు. కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, ఎమ్మెస్ ధోనీ, హార్ధిక్ పాండ్యా... రెండు సీజన్ల తర్వాత సూపర్ హిట్ పర్ఫామెన్స్ ఇస్తున్నారు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు ఎమ్మెస్ ధోనీ. కేకేఆర్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లోనే మాహీ బ్యాటు నుంచి హాఫ్ సెంచరీ వచ్చింది...
28
ఐపీఎల్ 2019లో ఆర్‌సీబీపై చివరిగా హాఫ్ సెంచరీ చేసిన ఎమ్మెస్ ధోనీ... గత రెండు సీజన్లలో దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 2020 సీజన్‌లో మొత్తంగా 200 పరుగులు చేసినా, గత సీజన్‌లో అయితే 120 కూడా కొట్టలేకపోయాడు....
38
అలాగే హార్ధిక్ పాండ్యా 2019 వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన తర్వాత గత రెండు సీజన్లలో బౌలింగ్ చేయలేకపోయాడు. ముంబై ఇండియన్స్ జట్టు హార్ధిక్ పాండ్యాని రిటైన్ చేసుకోకపోవడానికి ఇది కూడా ఓ కారణం...
48
ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఒక్క బంతి కూడా వేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు..
58
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చి, ఓ వికెట్ తీశాడు హార్ధిక్ పాండ్యా. ఢిల్లీ ఓపెనర్ టిమ్ సీఫర్ట్, హార్దిక్ బౌలింగ్‌లో అభినవ్ మనోహర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
68
ఐపీఎల్‌లో హార్ధిక్ పాండ్యా బౌలింగ్ వేయడం, వికెట్ తీయడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి. దీంతో మరోసారి అందరి చూపు విరాట్ కోహ్లీవైపు మళ్లింది..
78
విరాట్ కోహ్లీ చివరిగా 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి సెంచరీ నమోదు చేశాడు విరాట్ కోహ్లీ. 2020లో పెద్దగా క్రికెట్ ఆడే అవకాశం రాకపోగా, 2021లోనూ విరాట్ నుంచి సెంచరీ రాలేదు...
88
భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా... మూడేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ, తొలి వికెట్ తీసినట్టే... విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి సెంచరీ వస్తుందని ఆశిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్...