ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి శుబ్‌మన్ గిల్ ఎంట్రీ... టాప్ 50లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ...

Published : Aug 10, 2023, 11:51 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పైనే బోలెడు ఆశలు పెట్టుకుంది భారత జట్టు. వెస్టిండీస్ టూర్‌లో పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయిన శుబ్‌మన్ గిల్, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మాత్రం టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చేశాడు..

PREV
16
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి శుబ్‌మన్ గిల్ ఎంట్రీ... టాప్ 50లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ...

వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 7, 34, 85 పరుగులు చేశాడు శుబ్‌మన్ గిల్. మూడో వన్డేలో 85 పరుగులు చేసి, సెంచరీకి 15 పరుగుల దూరంలో అవుటైన శుబ్‌మన్ గిల్... ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి టాప్ 5లోకి ఎంట్రీ ఇచ్చాడు..

26

శుబ్‌మన్ గిల్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక మ్యాచ్ ఆడినా బ్యాటింగ్‌కి రాని విరాట్ కోహ్లీ, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 9లో ఉంటే, రోహిత్ శర్మ టాప్ 11లో ఉన్నాడు..

36

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లోనూ మూడు హాఫ్ సెంచరీలు బాది, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలిచిన ఇసాన్ కిషన్, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో 9 స్థానాలు ఎగబాకి టాప్ 36లో ఉన్నాడు.. కొన్నాళ్లుగా టీమ్‌కి దూరమైన శిఖర్ ధావన్- టాప్ 42లో, కెఎల్ రాహుల్ - టాప్ 46 ర్యాంకులో ఉన్నారు..

46

టీ20 సిరీస్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి, మూడు మ్యాచుల్లో అదరగొట్టిన తెలుగు తేజం తిలక్ వర్మ, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ పర్ఫామెన్స్‌తో తిలక్ వర్మకు ఆరంభంలోనే ఏకంగా టాప్ 46లో చోటు దక్కింది... 
 

56

వన్డే సిరీస్‌లో 3 మ్యాచుల్లో 7 వికెట్లు తీసి అదరగొట్టిన కుల్దీప్ యాదవ్, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. 8 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, టాప్ 40లో స్థానంలో కొనసాగుతున్నాడు..

66

మహ్మద్ సిరాజ్, వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 4లో ఉండగా, బాబర్ ఆజమ్ టాప్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. వన్డే ఆల్‌రౌండర్ల లిస్టులో టాప్ 10లో భారత ప్లేయర్లు ఎవ్వరూ లేరు. హార్ధిక్ పాండ్యా వన్డే సిరీస్‌లో ఇచ్చిన పర్ఫామెన్స్ కారణంగా 5 స్థానాలు ఎగబాకి టాప్ 11లోకి వచ్చాడు..

Read more Photos on
click me!

Recommended Stories