ఐపీఎల్ 2020 ద్వారా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం... స్టేడియానికి జనాలు రాకపోయినా...

First Published Nov 23, 2020, 10:55 AM IST

IPL 2020... ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ఐపీఎల్ 2020 సీజన్ చాలా ప్రత్యేకమైనది. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, ఐపీఎల్ నిర్వహించడం ఒక ఎత్తైతే, ఖాళీ స్టేడియాల్లో జరిగిన ఈ సీజన్ సూపర్ సక్సెస్ కావడం మరో ఎత్తు. అనేక అడ్డంకులు దాటుకుని ఐపీఎల్ 2020 సీజన్‌ను నిర్వహించిన బీసీసీఐకి, ఏకంగా 4 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ దుమాల్.

ఏడాది దేశం యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ నిర్వహించాలని బీసీసీఐ ఆలోచన చేసినప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు...
undefined
జనాలు కూడా లేని ఖాళీ స్టేడియాల్లో, ఛీర్ గర్ల్ కూడా లేకుండా జరిగే మ్యాచులను ఎవ్వరైనా చూడడానికి ఇష్టపడతారా? అని అనుమానాలు వ్యక్తం చేశారు...
undefined
అయితే అలాంటి డౌట్లను పటాపంచలు చేసిన ఐపీఎల్ 2020, రికార్డు లెవెల్లో సూపర్ హిట్టు కొట్టి, బీసీసీఐ గల్లా పెట్టెలు నింపేసింది...
undefined
బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ దుమాల్ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు... దుబాయ్‌లో లీగ్ నిర్వహించడం వల్ల 35 శాతం వ్యయం పెరిగినా లాభాలు కూడా అధికంగా వచ్చాయని చెప్పారు.
undefined
‘ఐపీఎల్ 2020 సీజన్ ద్వారా బీసీసీఐకి 4000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. టీవీ వ్యూయర్‌షిప్ 25 శాతం పెరిగింది. ఈ కారణంగా భారత్‌లో మ్యాచులు నిర్వహించినప్పుడు అయ్యే ఖర్చు కంటే 35 శాతం వ్యయం పెరిగినా లాభాలు కూడా ఎక్కువగా వచ్చాయి’ అని చెప్పాడు అరుణ్ దుమాల్...
undefined
ఐపీఎల్ 2020 సూపర్ సక్సెస్ తర్వాత 2021 లీగ్ కోసం మెగా వేలం నిర్వహించాలని ఆలోచనలు చేస్తోంది బీసీసీఐ. అదనంగా మరో ఫ్రాంఛైజీ లేదా రెండు ఫ్రాంఛైజీలు చేర్చాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే...
undefined
అదనంగా మరో జట్టు వస్తుండడంతో తుది జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలనే నిబంధనను సడలించాలని కొన్ని ఫ్రాంఛైజీలు... బీసీసీఐని కోరుతున్నాయట.
undefined
ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ప్రతీ జట్టులో కేవలం నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఐదుగురు విదేశీ ప్లేయర్లను తుది జట్టులోకి అనుమతించాలని కోరుతున్నాయి కొన్ని ఫ్రాంఛైజీలు.
undefined
అయితే దేశంలో యువ ఆటగాళ్లలోని టాలెంట్ ప్రపంచానికి చూపించేందుకు వేదికైన ఐపీఎల్‌లోవిదేశీ ఆటగాళ్ల నిబంధన మారిస్తే... అది ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లా కాకుండా ఎర్నింగ్ ప్రీమియర్ లీగ్‌లా మాత్రమే మిగిలుతుందని అంటున్నారు కొందరు క్రికెట్ అభిమానులు..
undefined
click me!